‘కారు’చిచ్చు రేగింది. అధికార పార్టీ టీఆర్ ఎస్ టికెట్ దక్కని నేతల అసంతృప్తి బయటపడుతోంది. అభ్యర్థులను ప్రకటించి వారం గడవడంతో చాలా నియోజకవర్గాల్లో అసమ్మతి పెద్ద ఎత్తున చెలరేగుతోంది. టికెట్ ఆశించి భంగపడిన వారు.. వారి అనుచరులు రెచ్చిపోతున్నారు. తాజాగా చెన్నూర్ టికెట్ దక్కని నల్లాల ఓదెలు స్వీయ గృహనిర్భంధం విధించుకున్నారు. టికెట్ దక్కించుకున్న ఎంపీ బాల్క సుమన్ ప్రచారానికి రాగా అతడి ముందే ఓదెలు అనుచరులు ఆత్మహత్యాయత్నానికి దిగడం దుమారం రేగింది. ఈ నేపథ్యంలో ఈ సంతృప్త నేతలను బుజ్జగించేందుకు మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు రంగంలోకి దిగారు. ఆయా నేతలతో చర్చలు జరుపుతూ.. పార్టీ గెలుపుకోసం కృషి చేయాలని కోరుతున్నారు.
ఓదెలు అనుచరుల ఆత్మహత్యతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కేసీఆర్ రంగంలోకి దిగారు. వెంటనే వచ్చి తనను కలువాలని ఓదెలుకు ఫోన్ ద్వారా సీఎం కేసీఆర్ కార్యాలయ అధికారులు ఆదేశించారు. ఓదెలు బుధవారమే హైదరాబాద్ కు బయలుదేరారు. దీంతో చెన్నూర్ రాజకీయం మరోసారి వేడెక్కింది. ఇక చాలా నియోజకవర్గాల్లో కూడా అసంతృప్త జ్వాలలు ఎగిసిపడుతున్నాయి.
ఆదిలాబాద్ పూర్వపు జిల్లాలోని ఖానాపూర్ టికెట్ తాజా మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్ కు కేసీఆర్ కేటాయించారు. దీంతో అక్కడ టికెట్ ఆశించిన రాథోడ్ రమేష్ టీఆర్ఎస్ పై తిరుగుబాటు చేసి స్వతంత్రంగా పోటీచేస్తానని ప్రకటించారు.
వరంగల్ పూర్వపు జిల్లాలోని స్టేషన్ ఘన్ పూర్ టికెట్ ఆశించిన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కూడా అసంతృప్తితో ఉన్నారట.. తాజా మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు టికెట్ ఇవ్వకుండా తన కుమార్తె కావ్యకు అవకాశం ఇవ్వాలని కడియం కోరుతున్నారు. అయితే తాటికొండ రాజయ్య ఏకంగా కడియం శ్రీహరి వద్దకు వెళ్లి పాదాభివందనం చేశారు. తనకు మద్దతివ్వాలని కోరారు. కానీ కడియం సానుకూలత వ్యక్తం చేయలేదు.
ఇక భూపాలపల్లి టికెట్ ఆశించిన టీఆర్ఎస్ నేత గండ్ర సత్యనారాయణ రావు అది దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్నారు. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తానని స్పష్టం చేశారు.
వేములవాడ టికెట్ ను ప్రస్తుత తాజా మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు టీఆర్ఎస్ కేటాయించింది. దీన్ని ఆశించిన కరీంనగర్ జడ్పీ చైర్మన్ తుల ఉమ అసంతృప్తితో ఉన్నారు. తన అనుకూలురతో కలిసి ఆందోళన చేయిస్తున్నారు.
రామగుండం టీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ ప్రస్తుత ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణకు ఇచ్చారు. ఇక్కడ టికెట్ ఆశించిన మరో టీఆర్ఎస్ నేత కోరుకంటి చందర్ తాను బరిలోకి దిగుతానని స్పష్టం చేశారు.
మునుగోడు నుంచి టికెట్ ఆశించిన వేనేపల్లి వెంకటేశ్వరరావు కూడా అసంతృప్తితో తాను పోటీలో ఉంటానని ప్రకటించారు.
చేవెళ్లలో గడిచిన సారి టీఆర్ఎస్ తరఫున పోటీచేసి ఓడిపోయిన కేఎస్ రత్నం టికెట్ ఆశించారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన తాజా మాజీ ఎమ్మెల్యే కాలె యాదయ్యను టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో రత్నం బుధవారం పార్టీకి రాజీనామా చేశారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోనూ టీడీపీ నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీచేసిన కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి సొంతంగా పోటీచేసేందుకు బరిలోకి దిగుతున్నారు.
షాద్ నగర్ తాజా మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కు మళ్లీ అవకాశం ఇవ్వడాన్ని నిరసిస్తూ సీనియర్ నేత అందె బాబయ్య - వీర్లపెల్లి శంకర్ లు టీఆర్ ఎస్ పై తిరుగుబాటు చేశారు.
ఇక సత్తుపల్లి నియోజకవర్గంలో టీఆర్ ఎస్ టికెట్ పొందిన పిడమర్తి రవి పై గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీచేసి రెండో స్థానంలో నిలిచిన మట్టా దయానంద్ తిరుగుబాటు చేశారు. ఆయన బరిలో దిగుతానని ప్రకటించారు.
ఇలా వీరందరినీ బుజ్జగించే పనిలో ప్రస్తుతం మంత్రులు కేటీఆర్ - హరీష్ రావులు బిజీగా ఉన్నారు. అసంతృప్తులతో చర్చలు జరుపుతున్నారు. వీరికి ప్రత్యామ్మాయ పదవులు ఇస్తానని హామీ ఇస్తున్నారు. కానీ టికెట్ కోసం మాత్రం తమ పంథాలను వీడడం లేదు.