బిల్డింగ్ లేకుండా చేసిన కేసీఆర్ కంటే ఒక బిల్డింగ్ కట్టిన బాబు బెటర్ కాదా?
నలుగురు బతకాలి అనుకునే రోజులు పోయి నేను బతకాలి అన్న రోజులు వచ్చి చాలానే రోజులైంది. ఇప్పుడు అది కూడా మారి.. నేను బతకాలి.. మరెవరూ బతకకూడదనే లెక్క ఒకటి ఈ మధ్యన ఎక్కువైంది. జాతీయస్థాయిలో చూసినా.. రాష్ట్రాల వారీగా చూసినా అధికారపక్షాలు తప్పించి.. విపక్షాలు కానీ.. కొత్త గొంతులు కానీ ఏవీ తెర మీదకు రాకూడదని.. ఒకవేళ వచ్చినా కూడా అవేమీ ఉనికి లేని రీతిలో.. ప్రభావం అన్నది చూపించని రీతిలో ఉండాలే తప్పించి అంతకు మించి మరో అడుగు ముందుకు వేసే అవకాశమే ఉండకూడదన్నట్లుగా ఉండటం ఈ మధ్యన ఎక్కువైంది.
తాజాగా తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు మాటలు దీనికి నిదర్శనంగా చెప్పాలి. తెలంగాణ కోసమే పుట్టినట్లుగా నిన్నటి వరకు బిల్డప్ మాటలు చెప్పిన వారు.. ఇప్పుడు యావత్ దేశాన్ని టార్గెట్ చేయటం ఒక ఎత్తు అయితే.. తాము ఉసురు తీసిన ఏపీని సైతం చక్కదిద్దుతామని చెప్పటం దేనికి నిదర్శనం? అన్నది ప్రశ్న. మరెక్కడా లేని రీతిలో ఎవరి ప్రయోజనాల్ని దెబ్బ తీశారో.. వారి బతుకుల్నే మారుస్తాం.. ఆ ప్రాంతంలోనే పవర్ లోకి వస్తామన్నట్లుగా మాట్లాడటం దేనికి నిదర్శనం?
ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు హైదరాబాద్ కు ఎంత చేశారు? ఏం చేశారు? లాంటివి హరీశ్ రావు లాంటి ఆరోగ్య మంత్రికి గుర్తు ఉండకపోవచ్చు. కానీ.. తన మేనమామ కేసీఆర్ గతంలో చంద్రబాబు హైదరాబాద్ కు ఏం చేశారు? ఆయన కారణంగా ఉమ్మడి ఏపీకి ఏం జరిగింది? ఎంత మేలు జరిగిందన్న విషయాన్ని చెప్పిన వీడియోక్లిప్పింగులు చూస్తే మంచిదేమో?
ఖమ్మం శంఖారావం సభ తర్వాత హరీశ్ కు అర్జెంట్ గా చంద్రబాబును తిట్టిపోయాలన్న ఆలోచన వచ్చింది. ఆయనతో పాటు మరికొందరికి కూడా వచ్చిందనుకోండి.చంద్రబాబును తిట్టటం ద్వారా మేనమామ దగ్గర మార్కులు కొట్టేయటంతో పాటు.. మేనమామకు తానెంత విధేయుడిగా ఉన్నానన్న విషయాన్ని అర్ధమయ్యేలా చేయటం కోసం ఆయన పడుతున్న తపన అంతా ఇంతా కాదు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ కు చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. ఒకే ఒక్క బిల్డింగ్ కట్టేసి సైబరాబాద్ కట్టించారన్న మాటల్లో అర్థం లేదని వ్యాఖ్యానించారు. హరీశ్ రావుకు సైబర్ టవర్స్ మొత్తం ఒక చిన్న బిల్డింగ్ మాదిరి కనిపించొచ్చు. అప్పట్లోనే రోడ్లను భారీగా వెడల్పు చేయించి.. భారీ ఎత్తున ఫ్లైఓవర్లు వేయించటం మొదలు.. హైదరాబాద్ రూపురేఖలు మార్చేందుకు పడిన కష్టం మొత్తం కనిపించకుండా పోయింది.
సరే.. చంద్రబాబు హైదరాబాద్ కు చేసింది పెద్దగా లేదనే అనుకుందాం. మరి.. ఏపీకి కేసీఆర్ ఏం చేశారని ఇప్పుడు ఆ రాష్ట్రంలో రాజకీయం చేసేందుకు.. అక్కడ పార్టీ ఆఫీసు పెడుతున్నది ఎందుకు? హరీశ్ మాటల ప్రకారం చంద్రబాబు కనీసం ఒక బిల్డింగ్ అయినా కట్టించారు.మరి.. కేసీఆర్ ఉన్న రాజధాని హైదరాబాద్ ను లేకుండా చేయటమే కాదు.. రాజధాని అన్నది లేకుండా చేశారు.
అంతేనా? ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న రాజధాని కదా? అంటూ ఏపీలోని మరే ప్రాంతం మీదా ఫోకస్ పెట్టకుండా హైదరాబాద్ పెట్టిన దానికి బదులుగా.. విభజన కారణంగా ఒక మహానగరం అన్నది ఏపీ ప్రజలకు చేసిన కేసీఆర్.. ఈ రోజున ఏ ముఖం పెట్టుకొని ఏపీకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు? అన్న ప్రశ్నకు కూడా సమాధానం చెప్పాలి కదా? అదేమీ లేకుండా చంద్రబాబును నాలుగు మాటలు అనే ముందు.. గులాబీ నేతలకున్న నలుపును హరీశ్ రావు ఆయన అనుచర గణం చూసుకోవాలి కదా? అదేమీ లేకుండా నోరు పారేసుకోవటంలో అర్థం ఉందంటారా?
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.