ఎస్.ఎల్.బీ.సీ టన్నెల్ ప్రమాద ఘటనలో కీలక అప్ డేట్!

శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం (ఎస్.ఎస్.బీ.సీ)లో చిక్కుకున్న వారి కోసం కొనసాగుతోన్న సహాయక చర్యల్లో ఏడో రోజైన శుక్రవారం కీలక పురోగతి కనిపించింది.

Update: 2025-02-28 14:02 GMT

శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం (ఎస్.ఎస్.బీ.సీ)లో చిక్కుకున్న వారి కోసం కొనసాగుతోన్న సహాయక చర్యల్లో ఏడో రోజైన శుక్రవారం కీలక పురోగతి కనిపించింది. ఈ సమయంలో టన్నెల్లో చిక్కుకున్న వారి ఆచూకీని గుర్తించేందుకు గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ టెక్నాలజీ ద్వారా సొరంగం స్కానింగ్ చేస్తుండగా.. ఐదు చోట్ల మెత్తని భాగాలు ఉన్నట్లు గుర్తించారని.. అవి మానవ దేహాలు కావొచ్చని చెబుతున్నారు.

అవును... శ్రీశైలం ఎడగమకాలువ సొరంగంలో వారం రోజుల క్రితం చిక్కుకుపోయిన ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు.. మొత్తం 8 మందిని బయటకు తీసుకొచ్చేందుకు వివిధ మార్గాల్లో చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని అంటున్నారు. ఈ సందర్భంగా టన్నెల్లో చిక్కుకున్న 8 మంది మృతిచెంది ఉంటారని చెబుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే 5 మృతదేహాలను దాదాపు గుర్తించారని అంటున్నారు.

ఇవాళ రెస్క్యూ ఆపరేషన్ లో భాగంగా రైల్వే శాఖ కూడా రంగంలోకి దిగింది. సొరంగం తవ్వేందుకు ఉపయోగించిన టీబీఎం మిషన్ అందులో చిక్కుకుపోవడంతో దాన్ని రైల్వే నిపుణులు ప్లాస్మా గ్యాస్ కట్టర్ల సాయంతో కట్ చేశారు. దీనివల్ల సహాయక బృందాలు లోపలికి వెళ్లేందుకు అవకాశం లభించిందని చెబుతున్నారు. ఈ సమయంలోనే మృతదేహాలు బురదలో కూరుకుపోయినట్లు గుర్తించారని తెలుస్తోంది.

జీపీఆర్ టెక్నాలజీతో మృతదేహాల గుర్తింపు!:

టన్నెల్ ప్రమాద స్థలంలో రక్షణ చర్యలను వేగవంతం చేసే ప్రక్రియలో భాగంగా... నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్జీఆరై) ఆపరేషన్ ఆరంభించింది. దీనికోసం భూమిలో కూరుకుపోయి ఉంటే.. వారి స్థితిని తెలుసుకునేందుకు అధునాతన టెక్నాలజీ జీరో గ్రావిటీ పెనట్రేటింగ్ రాడార్ టెక్నాలజీ ద్వారా వారిని గుర్తించేందుకు ప్రయత్నాలు చేసింది.

ఈ సమయంలో ఎన్జీఆరై బృందం టన్నెల్ లో స్కాన్ చేసి ఐదు మృతదేహాలను గుర్తించిందని.. ఈ సమయంలో అక్కడ మార్కింగ్ కూడా ఏర్పాటు చేశారని.. వీటిని మూడు మీటర్ల లోతులో కూరుకుపోయి ఉన్నట్లు గుర్తించారని తెలిసింది. ఈ నేపథ్యంలోనే మిగిలిన ముగ్గురు పరిస్థితి గురించి సెర్చ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సమయంలో మెత్తని భాగాలు ఉన్నచోట తవ్వకాలు జరుపుతున్నారని అంటున్నారు. ఈ సమయంలో.. గల్లంతైనవారి పరిస్థితిపై కాసేపట్లో అధికారిక సమాచారం వచ్చే అవకాశం ఉంది!

Tags:    

Similar News