పెద్ద నోట్లలో రూ.500 - రూ.1000ని రద్దు చేస్తూ కొత్తగా విడుదల చేసిన రూ. 2000 నోటుపై మంత్రి హరీశ్ రావు ఖుష్ అయ్యారు. పూర్వ మెదక్ జిల్లా జెడ్పీ సమావేశంలో పాల్గొన్న అనంతరం కొత్తగా విడుదలైన 2000 వేల రూపాయల నోటు తన వద్దకు వచ్చిందంటూ మంత్రి హరీశ్ రావుకు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి చూపించారు. కొత్త నోటు బాగుందంటూ మంత్రి ఆసక్తిగా పరిశీలించారు. నోటుకు మన పార్టీ కలర్ ఇంకా బాగుందంటూ పద్మాదేవేందర్ రెడ్డి అనడంతో నవ్వులు విరబూశాయి.
నీళ్లు - నిధులు - నియామకాలే ట్యాగ్ లైన్ గా సాధించుకున్న తెలంగాణను కోటి ఎకరాలను మాగాణిగా మార్చడమే సీఎం కేసీఆర్ లక్ష్యంమని సమావేశం సందర్భంగా హరీశ్ రావు వివరించారు. వ్యవసాయం కోసం విద్యుత్ - రుణమాఫీ సహా ఎన్నో చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ముఖ్యమైన సాగునీటి అంశంపై ఎక్కువ శ్రద్ధ పెట్టిందని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు బడ్జెట్ లో రూ.25 వేల కోట్లు కేటాయించామని వివరించారు. ప్రాజెక్టులపై సుదీర్ఘ సమీక్షలు నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్ ను చూసి ఇంజినీర్లే ఆశ్చర్యపోతున్నారన్నారు. ఈపీసీ విధానంతోనే గత ప్రభుత్వాల హ యాంలో ఎత్తిపోతల పథకాల పనులు నత్తనడకన సాగాయన్నారు. ఏఎమ్మార్పీ ఎల్లెల్సీ 2007లో ప్రారంభమై ఇన్నాళ్లూ సాగిందన్నారు. 19 ఏళ్లపాటు సాగిన దిగువ కాల్వ పనులను రెండేండ్లలో పూర్తి చేయించేందుకు ఎంతో కృషి చేశారని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు - సీఎం కేసీఆర్ పాలనతోనే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తవుతున్నాయన్నారు. రాష్ట్రం రాకపోయి ఉంటే 20 ఏళ్లయినా ఇవి అసంపూర్తిగానే ఉండేవన్నారు. సమైక్యపాలనలో తెలంగాణపై సవతి తల్లి ప్రేమ కొనసాగిందన్నారు. ఇప్పటికీ కృష్ణా నదిపై నిర్మిస్తున్న ఎస్సెల్బీసీ - పాలమూరు ఎత్తిపోతల - భీమా - డిండి వంటి ప్రాజెక్టుల విషయంలో కొర్రీలు పెడుతున్నారని మండిపడ్డారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/