తనను అవమానించినట్లుగా లోకమంతా ఫీలైపోతున్నా హరీశ్ రావు మాత్రం అలాంటిదేమీ లేదని చెబుతారు. ఇంకా మాట్లాడితే.. ఏం మాట్లాడుతున్నారు మీరు.. మా మధ్య లేని దాని గురించి అదే పనిగా ఎందుకు ప్రస్తావిస్తున్నారంటూ తేల్చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు అవునన్నా.. కాదన్నా టీఆర్ ఎస్ లో పవర్ గేమ్ నడవటం.. కేటీఆర్ వర్సెస్ హరీశ్ మధ్య పోరును కేసీఆర్ లెక్క తేల్చేయటం తెలిసిందే.
తన రాజకీయ వారసుడు తన కొడుకే అన్న విషయాన్ని గులాబీ బాస్ కేసీఆర్ తేల్చేయటమే కాదు.. టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కేటీఆర్ కు కట్టబెట్టిన వైనం తెలిసిందే. కష్టంలోనూ.. సుఖంలోనూ మేనమామ కేసీఆర్ వెంట నడిచిన హరీశ్ విషయంలో కేసీఆర్ చేయాల్సిన దాని కంటే ఎక్కువ తప్పులు చేశారన్న భావనను పలువురు వ్యక్తం చేస్తుంటారు.
తాజాగా ఆయన పుట్టినరోజు (జూన్ 3) సందర్భంగా ఆయన అభిమానులకు.. కార్యకర్తలకు దూరంగా.. ఎవరికి అందుబాటులో లేని చోటకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. చివరకు తనకు అత్యంత సన్నిహితులకు సైతం తన పుట్టిన రోజు నాడు అందుబాటులోకి రాలేదని చెబుతున్నారు.
తనను అభిమానించే వారికి దూరంగా ఉన్న హరీశ్.. తాను విపరీతంగా అభిమానించే తన మేనమామ కేసీఆర్ వద్దకు వెళ్లి.. ఆశీస్సులు తీసుకోకపోవటం విశేషం. తన పొలిటికల్ కెరీర్ కు గాడ్ ఫాదర్ లాంటి కేసీఆర్ వద్దకు వెళ్లకుండా ఉండటం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంతకీ తన పుట్టినరోజు వేళ.. కేసీఆర్ వద్దకు హరీశ్ రావు వెళ్లని వైనం ఇప్పుడు తాజా చర్చగా మారిందని చెప్పక తప్పదు.