విప‌క్షాలు డిఫెన్స్ లో ప‌డిపోతున్నాయ‌ట‌

Update: 2017-11-15 07:47 GMT
అసెంబ్లీ స‌మావేశాలంటే చాలు అధికార‌ప‌క్షానికి వ‌ణుకు పుట్ట‌టం.. విపక్షాలు విప‌రీత‌మైన ఉత్సాహానికి గురి కావ‌టం తెలిసిన ముచ్చ‌టే. కానీ.. తెలంగాణ రాష్ట్రంలో భిన్న‌మైన దృశ్యం ఇప్పుడు ఆశిష్కృత‌మ‌వుతోంది. అధికార‌ప‌క్షం చేసే త‌ప్పుల్ని ఎత్తి చూప‌టంలో విప‌క్ష నేత‌లు విఫ‌లం కావ‌టం.. మూడున్న‌రేళ్ల త‌ర్వాత కూడా అధికార‌ప‌క్షాన్ని ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేసేలా వాద‌న వినిపించే స‌త్తా విప‌క్ష నేత‌ల్లో అస్స‌లు క‌నిపించ‌టం లేదు.

అంతేకాదు.. అధికార‌ప‌క్షాన్ని నిల‌దీసే క్ర‌మంలో త‌మ‌ను తాము సెల్ఫ్ గోల్ చేసుకుంటున్న తీరుతో విప‌క్షాలు ఇప్పుడు విల‌విల‌లాడుతున్నాయ‌ట‌.  దీంతో.. రోటీన్‌కి భిన్నంగా ఎంత త్వ‌ర‌గా అసెంబ్లీ స‌మావేశాలు ముగిసిపోతే అంత బాగుండ‌న్న భావ‌న‌ను వ్య‌క్తం చేస్తున్నార‌ని తెలంగాణ రాష్ట్ర మంత్రి హ‌రీశ్ సైతం చెబుతున్నారు.

అసెంబ్లీ సంద‌ర్భంగా మీడియా మిత్రుల‌తో ఇష్టాగోష్ఠిగా మాట్లాడటం నేత‌ల‌కు అల‌వాటు. అదే రీతిలో మంత్రి హ‌రీశ్ మీడియాతో మాట్లాడుతూ విప‌క్షాల మీద చుర‌క‌లు వేశారు.  ఉమ్మ‌డి రాష్ట్రంలో ఉన్న‌ప్పుడు ఎక్కువ రోజులు స‌భ జ‌ర‌గాల‌ని విప‌క్షాలు కోరితే.. అధికార‌ప‌క్షం అస్స‌లు ఒప్పుకునేది కాద‌న్నారు.  తాము మాత్రం ఎక్కువ రోజులు స‌భ‌ను న‌డుపుతామ‌ని చెబుతున్నా విప‌క్షాలు ఇక చాలంటున్నాయ‌ని.. స‌మావేశాలు ఎంత త్వ‌ర‌గా ముగిస్తే అంత మంచిద‌న్న భావ‌న‌లో ఉన్న‌ట్లు చెప్పారు.

త‌మ ముఖ్య‌మంత్రి కేసీఆర్ చెప్పిన‌ట్లు 50 రోజుల పాటు విపక్షాలు కోరితే స‌భ‌ను నిర్వ‌హించేందుకు తాము సిద్ధంగా ఉన్న‌ట్లుగా చెప్పారు. అవ‌స‌ర‌మైతే మ‌రికొన్ని రోజులు ఎక్కువ‌గా స‌భ‌ను న‌డ‌ప‌టానికి సైతం తాము రెఢీగా ఉన్నామ‌న్నారు. ఏ అంశం మీద‌నైనా చ‌ర్చ‌కు తాముసిద్ధ‌మ‌ని కానీ ప్ర‌తిపక్షాలే స‌భ‌ను ముగించాల‌ని భావిస్తున్న‌ట్లు చెప్పారు. ఈ నెల 23న పెద్ద ఎత్తున పెళ్లిళ్లు ఉన్నాయ‌ని.. 24 త‌ర్వాత ప్ర‌ధాని మోడీ రాష్ట్ర ప‌ర్య‌ట‌న ఉన్న నేప‌థ్యంలో ఈ నెల 17తో స‌మావేశాల్ని ముగించాల‌ని విప‌క్షాలు కోరుతున్న‌ట్లు చెప్పారు. మొత్తానికి విప‌క్షాలు వ‌ద్దంటున్నాయ‌న్న పేరుతో స‌మావేశాల్ని క్లోజ్ చేయాల‌నుకుంటున్నారా? అన్న మాట వినిపిస్తోంది. వాస్త‌వంగా చూస్తే.. అధికార‌ప‌క్షం ధాటికి విప‌క్షాలు తేలిపోవ‌టం.. ఎంత త్వ‌ర‌గా అసెంబ్లీ స‌మావేశాలుముగిస్తే అంత బాగుండున్న భావ‌న వారిలో క‌నిపిస్తోంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అసెంబ్లీ సెష‌న్ కొన‌సాగుతుందా?  లేదా అన్న‌ది 17న జ‌రిగే స‌భా వ్య‌వ‌హారాల స‌ల‌హా సంఘంలో కీల‌క నిర్ణ‌యం తీసుకునే వీలుంది.
Tags:    

Similar News