ప్రజల మంత్రిగా హరీష్ రావుకు పేరుంది. ఏ సమస్య చెప్పినా వెంటనే పరిష్కరించడం ఆయన నైజం. అందుకే హరీష్ ను దేశంలోనే అత్యధిక మెజార్టీతో ప్రజలు గెలిపిస్తుంటారు.
తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ కు మంత్రి హరీష్ రావు ఫోన్ చేశారు. కోడకండ్ల దగ్గర కెనాల్ ను మంత్రి హరీష్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా కెనాల్ నుంచి కూడవెళ్లి వాగులోకి నీటిని వదలాలని రైతులు కోరారు. పంటలు ఎండిపోతున్నాయని.. కాపాడాలంటూ రైతులు హరీష్ రావును వేడుకున్నారు. కాళేశ్వరం నీళ్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
స్పందించిన మంత్రి వెంటనే పరిశీలించి మల్లన్నసాగర్ నుంచి కొండ పోచమ్మ జలాశయానికి వెళ్లి నీటిని కోడకండ్ల కాలువకు గండిపెట్టి సమీపంలో ఉన్న కూడవల్లి వాగులోకి నీటిని వదిలితే సమస్య పరిష్కారం అవుతుందని గుర్తించారు.
ఈ విషయంపై సీఎం కేసీఆర్ తో మంత్రి హరీష్ రావు ఫోన్ లో మాట్లాడారు. దీంతో తక్షణమే నీటిని వదిలి రైతుల అవసరాలు తీర్చాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
కూడవెళ్లి పరిసర రైతులకు దాదాపు 10వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని హరీష్ రావు పేర్కొన్నారు. వెంటనే ఈ విషయాన్ని కేసీఆర్ కు ఫోన్ లో తెలియజేయడం.. కేసీఆర్ స్పందించి వెంటనే పనులు ప్రారంభించి రైతులకు సాగునీరు అందించడంతో రైతులు హరీష్ కు కృతజ్ఞతలు తెలిపారు.