ట్రబుల్‌ షూటర్‌ కే ట్రబుల్

Update: 2021-11-03 02:30 GMT
హరీష్‌ రావు రంగం లోకి దిగా రంటే ఇక నల్లెరు మీద నడక లాగే ఉంటుందని టీఆర్‌ఎస్ నేతలు భావిస్తారు. ఆయన అసాధ్యాలను సు సాధ్యం చేయడం లో దిట్ట అనే పేరు ఉంది. హరీష్‌ రావు అడుగు పెడితే విజయం ఖాయమనే ధీమా టీఆర్‌ఎస్ ఉంది. అలాంటి ఆయన్ను అందరూ ట్రబుల్‌ షూటర్‌ గా అంటుంటారు. తెలంగాణ (పీకే)గా హరీష్‌ రావు ప్రశంసలు కూడా అందుకుంటున్నారు. అయితే ఆయన వ్యూహాల ను వరుసగా బీజేపీ చిత్తు చేస్తోంది. ఇప్పుడు ట్రబుల్‌ షూటరే ట్రబుల్‌ లో పడ్డారు. వరుస అపజయాల లో ఆయన దిక్కుతోచని స్థితి లో పడ్డారు. దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల బాధ్యతల ను హరీష్ రావు, కేసీఆర్ అప్పగించారు. రెండు చోట్ల ఆయన వ్యూహాలు ఫలించలేదు. ఇలా రెండు చోట్లు బీజేపీ గెలివడం తో ఆయనకు టీఆర్‌ఎస్‌ పై పట్టు తప్పుందనే విమర్శలు వెళ్తు వెత్తున్నాయి. హుజురాబాద్ ఓటర్ల ను ఆకట్టుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేయా లో అన్నీ ప్రయత్నాలు చేశారు.

హరీష్‌ రావు దాదాపు మూడు నెలలకు పైగా హుజురాబాద్‌ లో మకాం వేసినప్పటికీ ఫలితాలు తారు మారు కావడం ఆ పార్టీ నేతల కు నిరాశ కలిగిస్తోంది. టీఆర్‌ఎస్‌ కు కంచుకోట గా ఉన్న హుజురాబాద్ గడ్డ పై కాషాయం జెండా ఎగరడం అంత సామాన్య విషయం కాదని, ఈటల ను ఓడించడం ఖాయ మని తొలి నుంచీ ధీమా వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ప్రచార బాధ్యతలన్నీ మొదటి నుంచి హరీష్‌ రావు దగ్గరుండి చూసుకున్నారు. హుజురాబాద్ అభివృద్ధి తన బాధ్యతంటూ ఓటర్ల ను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు కేవలం ఓట్ల సమయం లోనే ప్రజల్లో కనిపిస్తారని, హుజురాబాద్ అభివృద్ధి కావాలంటే టీఆర్‌ఎస్‌కే ఓటు వేయాలని అభ్యర్థించారు. మరో వైపు బీజేపీ నుంచి పెద్ద ఎత్తున నేతలను టీఆర్‌ఎస్‌ లో చేర్చుకున్నారు. అయినప్పటికీ హుజురాబాద్ ప్రజలు మార్పును కోరుకున్నారు.

హామీలిస్తూ ప్రచారం చేశారే తప్ప.. ఓటరు నాడి ని పట్టుకోవడం లో హరీష్ రావు వైఫల్యం చెందారనే విమర్శలు వస్తున్నాయి. టీఆర్‌ఎస్‌ పై వస్తున్న వ్యతిరేకతను ఆయన గుర్తించలేక పోయారు. ప్రభుత్వం హామీలు అమలు కాకపోవడం తో ప్రజలు తీవ్ర అసహనం తో ఉన్నారు. ఓటరు నాడిని కని పెట్టకపోవడం కూడా ఓ కారణమని చెబుతున్నారు. 2018 ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే ప్రభుత్వం ఇప్పటి వరకు పూర్తి స్థాయి లో అమలు చేయలేదు. వీటన్నింటిని హరీష్ రావు గుర్తించ లేకపోయారు. ప్రభుత్వం పై నెలకొన్న తీవ్ర వ్యతిరేకత, అవినీతి, నిరుద్యోగం, యువత అసహనం వంటి ప్రధాన కారణా లే టీఆర్ఎస్ ను ఓడించాయని జోరు గా ప్రచారం సాగుతోంది. వరుస గా రెండోసారి అధికారం లోకి వచ్చిన టీఆర్ఎస్‌ కు.. ఇక ఎదురు ఉండదు అనుకుంటున్న సమయం లో వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గత ఏడాది నవంబర్‌ లో దుబ్బాక ఎన్నికల్లో ఘోర ఓటమిని చవి చూసిన టీఆర్ఎస్‌ కు మళ్లీ ఈ ఏడాది ఈటల రూపం లో ఎదురు దెబ్బ తగిలింది. హుజురాబాద్‌ లో టీఆర్ఎస్‌ జెండా ఎగిరేసి కేసీఆర్‌ కానుక గా ఇవ్వాలని హరీష్‌ రావు తహతహలాడారు. కోట్లకు ఓట్లు రాలవని హుజురాబాద్ ప్రజలు తేల్చి చెప్పారు. ఏదిఏమైనా టీఆర్ఎస్‌ మసకబారుతుందనడానికి హుజూరాబాద్ ఉప ఎన్నిక లే తాజా ఉదాహరణ.
Tags:    

Similar News