హార్లీ బైకు దొంగకు మైండ్ సరిగా లేదంట?

Update: 2015-09-05 17:59 GMT
బిగ్ షాట్స్‌ కు మాత్ర‌మే సొంత‌మ‌య్యే.. హార్లీ డేవిడ్‌ స‌న్ బైక్ ను న‌డ‌పాల‌న్న క‌సితోనే కొట్టేశాన‌ని నిందితుడు తొర్ల‌పాటి కిర‌ణ్ పోలీసుల ఎదుట ఒప్ప‌కున్నాడు. ఇటీవ‌ల బంజారా హిల్స్‌ లో ఓ షోరూం లో ఈ ఖ‌రీదైన బైక్ చోరీకి గురైన సంగ‌తి తెలిసిందే! బాధితుడి ఫిర్యాదు మేర‌కు రంగంలోకి దిగిన పోలీసులు  గాలింపు చేప‌ట్టి ఎట్ట‌కేల‌కు నిందితుడి ఆచూకీ ముంబై లో గుర్తించారు. ఈ సంద‌ర్భం గా పోలీసులు చేప‌ట్టిన విచార‌ణ‌లో గ‌త కొద్దికాలం గా మాన‌సిక స్థితి స‌రిగా లేనందునే తానీ దొంగ‌త‌నానికి పాల్ప‌డ్డాన‌ని కిర‌ణ్‌ వెస్ట్‌ జోన్ డీఎస్పీ వెంక‌టేశ్వ‌ర‌రావు ఎదుట అంగీక‌రించాడు.

ఓఎన్ జీ సీ ఉద్యోగైన కిర‌ణ్ 15 రోజులు స‌ముద్ర జ‌ల్లాల్లో విధులు నిర్వ‌హిస్తాడు. 15 రోజులు సెలవులో ఉంటాడు. రేయింబ‌వ‌ళ్లు పనిచేయ‌డం, నిద్రాహారాలు లేక‌పోవ‌డంతో మాన‌సికంగా తాను అనారోగ్యానికి గుర‌య్యాన‌ని కిర‌ణ్ చెప్పాడు.నిందితుడి నుంచి బైక్ స్వాధీనం చేసుకున్నామ‌ని, దీని విలువ ఆరు ల‌క్ష‌ల‌కు పైగా ఉంటుంద‌ని పోలీసులు తెలిపారు.

ఇంత‌కీ ఆ రోజు ఏం జ‌రిగిందంటే..

నాలుగు రోజుల క్రింద‌ట‌  సాయంత్రం నాలుగు గంట‌లు. స్థ‌లం : బంజారాహిల్స్ రోడ్ నంబ‌ర్ 2 లోని సాగర్ సొసైటీ చౌరస్తా. పేరొందిన ప్ర‌ముఖ‌ బైక్ షోరూం. ఇంత‌లో అక్క‌డికో వ్య‌క్తి చేరుకున్నాడు. టిప్ టాప్ గా త‌యారై వ‌చ్చి, షోరూంలోకి ఎంటరయ్యాడు.హై- ప్రొఫైల్ సొసైటీకి చెందిన‌వాడిలా.. బిల్డప్ ఇచ్చాడు.తన పేరు సయ్యద్ తాహెర్ అని పరిచయం చేసుకున్నాడు. తాను నెలకు లక్షన్నర సంపాదించే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నని చాలా సాఫ్ట్ గా చెప్పాడు.ఓహో! అనుకున్నారు..నిజ‌మ‌ని న‌మ్మారు అక్క‌డిస్టాఫ్. ఇంకేముంది క్రెడిట్ కార్డులు చూపించి టెస్ట్ రైడ్ పేరుతో 6లక్షల రూపాయ‌ల విలువైన హార్లీ డేవిడ్‌స‌న్ స్ట్రీట్-750 మోడ‌లః బైక్‌ తో ఉడాయించాడు. అత‌డిచ్చిన సెల్‌నంబర్ కు కాల్ చేస్తే స్విచాఫ్. ఎంత వెతికినా దొర‌క‌లేదు అత‌డి కేరాఫ్‌. ఇక చేసేది లేక‌.. .షోరూం యాజమాన్యం పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. అదండీ మేట‌ర్‌.
Tags:    

Similar News