అశోక్ ఖేమ్కా... అన్యాయాన్ని ప్రశ్నించే ఐఏఎస్ అధికారుల లిస్ట్‌లో ప్రముఖంగా ఉండే పేరు. కొందరు ఐఎఎస్ లు ముక్కుసూటిగా పోతే...మరికొందరు రాజీపడి పని చేసుకుంటూ పోతారు. అలా వెనక్కి తగ్గని ఐఎఎస్ అధికారే అశోక్ ఖేమ్కా. కాంగ్రెస్ అధినేత్రి అల్లుడు రాబర్ట్ వాద్రాపై భూ కుంభకోణం ఆరోపణలు బయటపెట్టి సంచలనం సృష్టించారు. హర్యానాలో ఎనిమిదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఏకంగా రూ.3.5 లక్షల కోట్ల విలువైన భూ కుంభకోణాలు జరిగాయని ఖేమ్కా సంచలన ఆరోపణలు చేశారు.
"2005 నుంచి 2012 మధ్య భూపీందర్ సింగ్ హయాంలో 21,366 ఎకరాల విస్తీర్ణంలో వెలిసిన పలు కాలనీలకు లెసైన్సుల జారీ ముసుగులో ఈ బాగోతాలన్నీ చోటుచేసుకున్నాయి. ఈ కుంభకోణాల్లో భారీగా అనుచిత లబ్ధి పొందిన వారి జాబితాలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా కూడా ఉన్నారు. తప్పుడు డాక్యుమెంట్లు, బూటకపు లావాదేవీల ఆధారంగా గుర్గావ్ జిల్లా శిఖోపూర్ గ్రామంలో 2.7 ఎకరాల అతి విలువైన భూమిని వాద్రా చేజిక్కించుకున్నారు" అంటూ" నిప్పులు చెరిగారు. రాబర్ట్‌వాద్రా భూముల అంశంలో ఏమాత్రం వెనకడుగు వేయకుండా దర్యాప్తు చేసి అవినీతిపై అవిశ్రాంత పోరాటం జరిపారు.
అలా సర్వీసులో ముక్కుసూటితనం, నిజాయితీకి ప్రతిఫలంగా కాంగ్రెస్ హయాంలో దక్కిందేమిటంటే 44 బదిలీలు. అయితే తాజాగా హర్యానా ప్రభుత్వం ఖేమ్కాకు ప్రిన్సిపల్ సెక్రటరీగా పదోన్నతి కల్పించింది. ఆయనకు పదోన్నతి కల్పించడంపై అవినీతి వ్యతిరేక ఉద్యమకారులు హర్షం వ్యక్తంచే స్తున్నారు. ఒక నిజాయితీపరుడైన ఐఏఎస్ అధికారికి ఆలస్యంగా అయిన న్యాయం జరగడం హర్షించదగ్గ విషయమే.