వైసీపీలో ఒక విషయం ఆసక్తిగా మారింది. పార్టీలో కీలకనేత, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి తనయుడు మోహిత్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో టికెట్ కన్ఫర్మ్ చేశారా? అనే చర్చ సాగుతోంది. ఎందుకంటే.. తాజాగా చెవిరెడ్డికి వైసీపీ అనుబంధ విభాగాల సమన్వయకర్తగా సీఎంజగన్ బాధ్యతలు అప్పగించారు. అంతేకాదు.. ఈయనను కీలక నాయకుడు, నెంబర్ 2 స్థానంలో ఉన్న సాయిరెడ్డికి సహాయకుడిగా నియమించారు.
ఇక, మరోవైపు.. చెవిరెడ్డికి ఇప్పుడున్న తిరుపతి జిల్లా వైసీపీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించారు. ఈ పరిణామాలతో చెవిరెడ్డి విషయంలో జగన్ ఏదో సంచలన నిర్ణయం తీసుకుంటున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. ఇక, చెవిరెడ్డి ప్రస్థానాన్ని చూస్తే.. ఆయన 2009 కి ముందు కాంగ్రెస్‌లో ఉన్నారు. అప్పట్లో వైఎస్ అభిమానిగా.. బ్యానర్లు కట్టే స్థాయి నుంచిపార్టీలో ఎదిగారు. అనంతరం.. వ్యూహాత్మంగా వైఎస్ జగన్ చెంతకు చేరారు. ఈ క్రమంలోనే ఆయనకు నమ్మిన బంటుగా ఇంతింతై అన్నట్టుగా ఎదిగారు.
అత్యంత కీలకమైన చంద్రగిరి నియోజకవర్గం నుంచి వరుస విజయాలు దక్కించుకున్న చెవిరెడ్డి.. రాజకీయాల్లో 2014-19 మధ్య జరిగిన ఐదేళ్లు స్వర్ణయుగమనే చెప్పాలి. ఆయనే నిత్యం మీడియాలో ఉండేవారు. టీడీపీ నేతలపై ఫైర్‌బ్రాండ్ మాదిరిగా నిప్పులు చెరిగారు. "అద్యచ్చా!!" అంటూ తనదైన శైలిలో అసెంబ్లీలో విమర్శలు గుప్పించేవారు. ఇలా.. జగన్ మనసు దోచుకున్న చెవిరెడ్డి.. ఆయన ఏ పదవి ఇచ్చినా.. కాదనలేదు. ఇది కావాలని అడిగిన రోజు కూడా లేదు.
ఇటీవల ఏప్రిల్‌లో మంత్రి వర్గ ప్రక్షాళన సమయంలో జగన్ కు సంకట స్థితి వచ్చింది. చెవిరెడ్డి వంటి నమ్మకస్తుడికి ఇవ్వాలా ? వద్దా? అనే మీమాంసలో పడ్డారు. ఈ సమయంలో స్వయంగా జోక్యం చేసుకున్న చెవిరెడ్డి.. జగన్ భారాన్ని దించేశారు. నాకు వద్దులే అన్నా.. అంటూ.. మంత్రి వర్గ జాబితా నుంచి తనపేరును తనే తీయించేసుకున్నారు. ఇలా.. జగన్‌కు అన్ని విషయాల్లోనూ చెవిరెడ్డి ఆత్మీయుడిగానే ఉన్నారు.
అంతేకాదు.. తాడేపల్లి నివాసంలో గోసంరక్షణ నిలయాన్ని తన చేతులతో నిర్మించారు. ఇంట్లో పనులను కూడా నేను ఎమ్మెల్యే అన్న విషయాన్ని పక్కన పెట్టి మరీ చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఇప్పుడు చెవిరెడ్డికి జగన్ ప్రమోషన్ ఇచ్చారని తెలుస్తోంది. అదేసమయంలో అప్రకటితమే అయినా.. చెవిరెడ్డి కుమారుడికిటికెట్ కన్ఫర్మ్ చేశారని చర్చనడుస్తుండడం గమనార్హం. ఇక, మోహిత్ కూడా.. తండ్రిబాటలోనే ప్రజలకు చేరువ అవుతుండడం గమనార్హం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.