షమీపై మళ్లీ అవే ఆరోపణలు

Update: 2019-07-10 05:57 GMT
ఈ వరల్డ్‌ కప్‌ లో  టీం ఇండియా అద్బుత విజయాలను దక్కించుకున్న విషయం తెల్సిందే. పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో నిలిచి సెమీస్‌ కు వెళ్లింది. టీం ఇండియా విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఫేసర్‌ మహ్మద్‌ షమీ. నాలుగు మ్యాచ్‌ లలో ఏకంగా 14 వికెట్లు తీసిన షమీపై ఒక వైపు ప్రశంసలు కురుస్తుంటే మరో వైపు గతంలో ఎదుర్కొన్న ఆరోపణలనే మళ్లీ ఎదుర్కొంటున్నాడు.

కొన్ని నెలల క్రితం షమీ భార్య హాసీన్‌ అతడిపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. షమీ ఉమనైజర్‌ అని అతడు అదనపు కట్నం కోసం నన్ను వేదిస్తున్నాడు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దాంతో బీసీసీఐ కొన్నాళ్ల పాటు షమీని దూరంగా కూడా పెట్టింది. అయితే బీసీసీ విచారణ జరిపి క్లీన్‌ చీట్‌ ఇచ్చింది. దాంతో మళ్లీ టీంలోకి వచ్చాడు. ప్రస్తుతం మస్త్‌ ఫామ్‌ లో ఉన్న షమీ పై సోఫియా అనే మహిళ సంచలన ఆరోపణలు చేయడంతో పాటు సాక్ష్యంను కూడా బయట పెట్టింది.

1.4 మిలియన్‌ ఫాలోవర్స్‌ ఉన్న ఈ గొప్ప క్రికెటర్‌ నాకు ఎందుకు పదే పదే మెసేజ్‌ చేస్తున్నారో మీరు ఎవరైనా చెప్పగలరా అంటూ ఒక స్క్రీన్‌ షాట్‌ ను పోస్ట్‌ చేసింది. ఇన్‌ స్టాగ్రామ్‌ లో తనకు షమీ గుడ్‌ ఆఫ్టర్‌ నూన్‌ అంటూ మెసేజ్‌ చేసిన విషయాన్ని సోఫియా సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేయడంతో అంతా అవాక్కవుతున్నారు. ఇలాంటి సమయంలో ఈ విషయాన్ని బయట పెట్టడం సరైన పద్దతి కాదని సోఫియా తీరుపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు షమీ అలా చేసి ఉండడు అంటూ మద్దతు తెలుపుతుంటే మరి కొందరు షమీ ఇంకా మారలేదా అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ విషయమై షమీ ఎలా స్పందిస్తాడో చూడాలి.

Tags:    

Similar News