భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమిని అతడి భార్య షహీన్ జహాన్ అంత తేలిగ్గా వదిలేలా లేదు. షమి రాజీ ప్రయత్నాలు చేసినన్నాళ్లూ బెట్టు చేసిన ఆమె.. ఇటీవలే భర్తతో రాజీ ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. షమి ఇటీవలే ఒక రోడ్డు ప్రమాదంలో గాయపడిన నేపథ్యంలో అతడిపై సానుభూతి వ్యక్తం చేస్తూ.. అతడితో రాజీకి సిద్ధమన్నట్లు మాట్లాడింది షహీన్. ఐతే షమిని కలవడానికి కూతురితో కలిసి వెళ్లినపుడు.. అతను తనతో మాట్లాడటానికి అంగీకరించకపోవడం.. కోర్టులో తేల్చుకుందామని అనడంతో షహీన్ కు మండినట్లుంది. ఆమె మళ్లీ రివర్స్ గేర్ లోకి వెళ్లిపోయింది. షమిపై పోరాటాన్ని కొనసాగించడానికే నిర్ణయించుకుంది.
షమి వ్యక్తిగత వ్యవహారాలతో తమకు సంబంధం లేదంటూ బీసీసీఐ అతడి కాంట్రాక్టును పునరుద్ధరించడంతో ఇక బోర్డుతో పెట్టుకుని లాభం లేదని భావించిన షహీన్.. అతడి ఐపీఎల్ అవకాశాలపై దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తోంది. షమి ఐపీఎల్‌లో ప్రాతినిధ్యం వహించబోతున్న ఢిల్లీ డేర్ డెవిల్స్ ఫ్రాంఛైజీ యజమాని హేమంత్ దువాను కలిసింది. తమ వ్యక్తిగత వివాదాలు పరిష్కారమై.. షమిపై నడుస్తున్న కేసుల వ్యవహారం కూడా తేలే వరకు షమిని ఐపీఎల్‌లో ఆడించొద్దని ఆమె దువాను కోరడం గమనార్హం. ఐతే బీసీసీఐయే షమి విషయంలో లైట్ తీసుకున్న నేపథ్యంలో ఐపీఎల్ ఫ్రాంఛైజీ అతడి విషయంలో కఠినంగా వ్యవహరిస్తుందా అన్నది సందేహం. బీసీసీఐ కాంట్రాక్టు పునరుద్ధరించగానే షమితో రాజీకి ప్రయత్నించిన షహీన్.. అతను తనను కలవడానికి నిరాకరించగానే వైఖరి మార్చుకోవడం ఆమె తీరుపై సందేహాలు రేకెత్తిస్తోంది.