విధి నిర్వహణలో భాగంగా ఓ మసీదు వద్ద ఫొటోలు తీయడమే... జమ్మూ కాశ్మీర్‌కు చెందిన డీఎస్పీ ఆయూబ్ పండిత్ చేసిన పాపమైపోయింది. తమ మసీదు సమీపంలోనే ఫొటోలు తీస్తావా? అంటూ అక్కడున్న కొందరు యువకులు ఆయనపైకి దాడికి దిగారు. ఆత్మరక్షణలో భాగంగా తుపాకీ తీసి కాల్పులు జరపబోయిన ఆయనను ఆ అల్లరి మూక రాళ్లతో కొట్టి చంపేసింది. రెండు రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్ లో చోటుచేసుకున్న ఈ ఘటన దేశంలోనే పెను కలకలం రేపింది. డీఎస్పీని రాళ్లతో కొట్టి చంపేసిన అల్లరి మూకలపై అన్ని వైపుల నుంచి విమర్శలు రేకెత్తుతున్నాయి. అయితే దేశంలో శాంతి భద్రతల పర్యవేక్షణ బాధ్యతల భుజానికెత్తుకున్న కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ మెహరుషికి మాత్రం ఈ విషయం అసలు తప్పుగానే కనిపించలేదట.
ప్రధాని నరేంద్ర మోదీ ఏరికోరీ కేంద్ర సర్వీసులకు తెచ్చుకున్న ఈ గుజరాత్ కేడర్ ఐఏఎస్ అధికారి ఇటీవలే కేంద్ర హోం శాఖ కార్యదర్శిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. దేశంలో ఎక్కడ అల్లర్లు జరిగినా, పరిస్థితి అదుపు తప్పుతోందని తెలిసినా... సమాచారం అందిన వెంటనే ఆయా విభాగాలను అలర్ట్ చేయడంతో పాటు సంఘ విద్రోహ శక్తుల ఆట కట్టించేలా చర్యలు తీసుకునే ఈ కీలక పదవిలోకి వచ్చిన మెహరుషి... కశ్మీర్ ఘటనపై విచిత్రంగానే కాకుండా దేశ ప్రజల కోపం కట్టలు తెంచుకునేలా వ్యవహరించారు.
జైపూర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన వద్ద మీడియా... కశ్మీర్‌లో అల్లరి మూకల దాడిలో చనిపోయిన డీఎస్పీ ఆయూబ్ పండిత్ విషయాన్ని ప్రస్తావించింది. వెనువెంటనే మెహరుషి... రాళ్లతో కొట్టి చంపడం కొత్తేమీ కాదని చాలా విచిత్రంగా స్పందించారు. మీడియా ప్రతినిధులకు షాకిచ్చారు. ఈ తరహా ఘటనలు దేశంలో కొత్తేమీ కాదు. ఈ తరహా దాడులు పెత్తందారీ వ్యవస్థలో అలవాటే. అయితే బాధ్యులు మాత్రం పశ్చాత్తాపపడాల్సి వస్తుంది. అయితే ఇవేవో ఇప్పుడే జరిగినట్టు చెప్పడం మీకు సరి కాదు. అంతేకాకుండా ఇలాంటి ఘటనలను మరింత పెద్దవిగా మీడియా చూపిస్తోంది* అని ఆయన తనదైన శైలిలో చెప్పుకుపోయారు. బాధిత డీఎస్పీ కుటుంబానికి ఓదార్పు ఇచ్చేలా వ్యవహరిస్తారనుకుంటే... ఇలాంటి ఘటనలు కొత్తేమీ కాదంటూ సాక్షాత్తు కేంద్ర హోం శాఖ కార్యదర్శే వ్యాఖ్యానించడంతో మీడియా ప్రతినిధులు నివ్వెరపోయారట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/