మోడీ కాబినెట్ లో ఈ వైరుధ్యం గమనించారా? ఆస్తులే కాదు అప్పులున్నోళ్లు కూడా!
అధికారంలోకి వచ్చిన తర్వాత పదవుల్ని పంచటానికి అధినేతలు చూపించే ఆచితూచి తత్త్వం ఆసక్తికరంగా ఉంటుంది. టీడీపీ అధినేత చంద్రబాబు కావొచ్చు.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కావొచ్చు.. చివరకు ప్రధాని మోడీ సైతం ఇలాంటి పరిస్థితే. రెండోసారి అదిరే మెజార్టీతో విజయం సాధించి కేంద్రంలో అధికారాన్ని చేపట్టినప్పుడు.. మంత్రివర్గాన్ని పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసే వీలు ఉన్నప్పటికి తక్కువమందితో ప్రభుత్వాన్ని నడిపించాలన్నట్లుగా వ్యవహరించటం ఆసక్తికరంగా ఉంటుంది. అలాంటి ఆయన తాజాగా తన కాబినెట్ ను 77కు పెంచేసిన విషయం తెలిసిందే. కొత్తగా కొలువు తీరిన కేంద్రమంత్రి వర్గానికి సంబంధించిన ఫుల్ స్కానింగ్ ను తాజాగా ఎలక్షన్ వాచ్ సంస్థ చేపట్టింది.
తాజాగా కొలువు తీరిన కాబినెట్ లోని వారందరిపై ఉన్న కేసులు ఏమిటి? వారికి ఉన్న ఆస్తులు.. అప్పుల లెక్క తేల్చటంతో పాటు.. పలు ఆసక్తికర అంశాల్ని వెలుగులోకి తెచ్చారు. మరింత సమాచారాన్నిఎలా సేకరించారంటారా? దానికో మార్గాన్ని అనురించారు. లోక్ సభకు.. రాజ్యసభకు ఎన్నికయ్యే సమయంలో సదరునేతలు దాఖలు చేసిన అఫిడవిట్లలో అధికారికంగా పేర్కొన్న సమాచారాన్ని ఆధారంగా చేసుకొని ఒక నివేదికను తయారు చేశారు. ఇందులోని అంశాల్ని చూసినప్పుడు ఆసక్తికరంగా కనిపిస్తాయి. నివేదికలో మంత్రులపై ఉన్న క్రిమినల్ కేసులు.. ఏ తరహా నేరాలకు వారు పాల్పడినట్లుగా వారిపై ఆరోపణలు ఉన్నాయన్న విషయంపై ఫోకస్ చేశారు. అంతేకాదు.. వారి విద్యార్హతలు ఏమిటి? అన్న విషయాన్ని తెలియజెప్పే ప్రయత్నం చేశారు.
కేంద్రమంత్రులుగా ఉన్న వారు సుద్దపూసలన్న ఇమేజ్ లేని రీతిలో వారి అఫిడవిట్లు ఉన్నాయి. కేంద్ర కాబినెట్ లో చోటు దక్కించుకున్న వారిలో 42 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉండటం గమనార్హం. ఇందులో 31 శాతం మంత్రులపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉండటం గమనార్హం. చివరకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఎంపికైన నిశిత్ ప్రమానిక్ పైనా హత్య సంబంధిత కేసు ఉండటం విమర్శలకు తావిచ్చేదే. మొత్తం నలుగురు మంత్రులపై హత్యాయత్నం కేసులు ఉండటం గమనార్హం.
పశ్చిమ బెంగాల్ కు చెందిన జాన్ బర్లాపై తీవ్రమైన కేసులు 24 ఉండగా.. అదే రాష్ట్రానికి చెందిన నిశిత్ ప్రమానిక్ పైన తీవ్రమైన కేసులు 21 ఉన్నట్లు తేల్చారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన పంకజ్ చౌధరి పైన తీవ్రమైన క్రిమినల్ కేసులు ఆరు ఉండగా.. మహారాష్ట్రకు చెందిన మురళీధరన్ పైన మూడు తీవ్రమైన కేసులు ఉన్నాయి. మొత్తం కాబినెట్ లో ఐదుగురు కేంద్రమంత్రులపై మత ఘర్షణ కేసులు ఉండటం విశేషం. మత విశ్వాసాల్ని అవమానించటం ద్వారా మతపరమైన ఘర్షణలకు ఉద్దేశపూర్వక చర్యలకు పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో అమిత్ షా (గుజరాత్), గిరిరాజ్ సింగ్ (గుజరాత్), శోభ కరాంద్లాజే (కర్ణాటక), నిత్యానంద రాయ్ (బిహార్)కు చెందిన నేతలు ఉన్నారు.
విద్యార్హతల విషయానికి వస్తే.. 12 మంది మంత్రులు కేవలం 8-12 తరగతి వరకు మాత్రమే చదివినోళ్లు ఉన్నట్లు తేలింది. 64 మంది మంత్రులు గ్రాడ్యుయేషన్ అంతకంటే ఎక్కువగా చదివినట్లుగా తేల్చారు. ఎనిమిదో తరగతి పాస్ అయిన వారిలో జాన్ బర్లా.. నిశిత్ ప్రమానిక్ లు ఉండగా.. పదో తరగతి పాస్ అయిన కేంద్రమంత్రులుగా బిశ్వేశ్వర్ తుడు.. రామేశ్వర్ తేలి.. నారాయణరాణేలు ఉన్నారు. ప్లస్ టూ పూర్తి చేసిన నేతలుగా అమిత్ షా.. అర్జున్ ముండా.. పంకజ్ చౌదరి.. రేణుక సింగ్ సూరత.. సాధ్వి నిరంజన్ జ్యోతి.. స్మృతి ఇరానీ.. రాందాస్ అథవాలేలు ఉన్నట్లుగా తేల్చారు. మొత్తంగా చూసినప్పుడు తీవ్రమైన క్రిమినల్ కేసులు.. మతఘర్షణ కేసులు ఉన్న నేతలు కేంద్రమంత్రులుగా కీలక స్థానాల్లో ఉన్న విషయం తాజా అసెస్ మెంట్ తో తేలుతుందని చెప్పక తప్పదు.