ఇవే.. రోహిత్ సూసైడ్ ఇష్యూ అప్ డేట్స్

Update: 2016-01-22 07:42 GMT
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పీహెచ్ డీ విద్యార్థి రోహిత్ ఉదంతంలో పలు పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రోహిత్ సూసైడ్ వ్యవహారం పెద్ద ఎత్తున వివాదాస్పదం కావటం.. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మొదలు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వరకూ పలువురు జాతీయ స్థాయి నేతలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి రావటం.. రోహిత్ ఇష్యూ మీద ఆందోళన చేస్తున్న విద్యార్థులకు తమ మద్దతు ప్రకటించటం తెలిసిందే.

వరుసగా చోటు చేసుకున్న పరిణామాలతో సెంట్రల్ యూనివర్సిటీ యాజమాన్యం మెట్టు దిగి.. సస్పెన్షన్ విధించిన విద్యార్థులపై వేటును తొలగించింది. అనంతరం విద్యార్థుల ఆందోళన తగ్గుముఖం పడుతుందన్న అంచనాలు వ్యక్తమయ్యాయి. మరి.. తాజాగా వర్సిటీలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయన్న విషయాన్ని చూస్తే..

= వరుసగా చోటు చేసుకున్న పరిణామాలతో వర్సిటీలో విద్యార్థులకు అందిస్తున్న వైఫై సౌకర్యాన్ని వర్సిటీ నిలిపివేసింది.

= విద్యార్థుల్ని లైబ్రరీకి అనుమతించే విషయంలోనూ పరిమితులు విధించారు.

= రోహిత్ సూసైడ్ నోట్ లో కొట్టేసిన పేరా విషయం ఇప్పుడు వివాదంగా మారింది.

= తాను రాసిన ఒక పేరాను నిండా కొట్టేసి.. అక్షరాలు ఏ మాత్రం కనిపించకుండా ఇంకుతో రుద్దేసి ఉన్న పేరాగ్రాఫ్ పక్కన నేనే కొట్టేస్తున్నాను.. అంటూ రోహిత్ సంతకం ఉంది. దీనిపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

= కొట్టేయాలనుకుంటే ఒక్క అడ్డగీత.. లేదంటే నాలుగు అడ్డగీతలు ఉండాలే కానీ.. ఒక్క అక్షరం కూడా కనిపించకుండా రుద్దేయాల్సిన అవసరం ఏమిటి? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

= నిజంగా అంత పెద్ద తప్పే ఉంటే.. దాన్ని చించేసి.. మరో లేఖ రాసేయొచ్చు కదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

= తాజా సందేహాల నేపథ్యంలో రోహిత్ లేఖను ఫోరెన్సిక్ ల్యాబ్ పరీక్షలకు పంపారు. ల్యాబ్ నివేదికపై ఇప్పుడు ఉత్కంట నెలకొంది.
Tags:    

Similar News