కొడుకు పోయిన బాధ ఒకటైతే.. తమ కులానికి సంబంధించిన వివాదం మరో బాధగా మారింది రోహిత్ తండ్రి మణికుమార్ కి. ఎదిగిన కొడుకును చూసుకొనే ఆయనకు.. ఇప్పుడా కొడుకు లేకుండా పోవటం వేదనగా మారితే.. మీదే కులం అంటూ అడిగేస్తున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక సతమతమవుతున్న పరిస్థితి. తాజాగా ఆయన తన కొడుకు గురించి.. తన కొడుకు కుల వివాదం గురించి మాట్లాడారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పీహెచ్ డీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య చేసుకోవటం పెద్ద సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. రోహిత్ మరణం తర్వాత ఆయన కులం మీద పెద్ద వివాదమే నడుస్తోంది. రోహిత్ దళితుడు అని చెబుతుంటే.. అతడు దళితుడు కాదని.. బీసీ అంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రోహిత్ తండ్రి మణికుమార్.. తమ కులం మీద కొన్ని మీడియా సంస్థలు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. తమది వడ్డెర కులం అని.. తాము బీసీలమని రోహిత్ తండ్రి వివరించారు. తనకు ఇద్దరు కొడుకులనీ.. ఇద్దరూ బాగా చదువుకునే వారని.. రోహిత్ మరణంపై తల్లి ఏం చెబుతుందో.. కులాల సర్టిఫికేట్లు ఏమిటో తనకు అర్థం కావటం లేదని వాపోయాడు.
కులాల కుమ్ములాటలు వద్దని.. తన కొడుకు ఆత్మహత్యపై న్యాయం చేయాలని ఆయన అభ్యర్థించారు. తన వివరాలు వెల్లడిస్తూ.. ‘‘మాది గుంటూరు జిల్లా గురజాల. నా భార్య రాధిక. మాకు ఇద్దరు కొడుకులు. ఒక కూతురు. చిన్న గొడవలతో మేం విడిపోయాం. పిల్లల కోసం కలిశాం. మాది వడ్డెర కులం. మేం మొదట్నించి బీసీలం. ఎస్సీ.. ఎస్టీలుగా ఎలా చేర్చారో తెలీదు. అలా చేసిన వాళ్లనే అడగండి’’ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. రోహిత్ దళితుడని.. అందుకే అతనిపై వివక్ష ప్రదర్శిస్తున్నారంటూ వాదించే రాజకీయ నేతలు రోహిత్ తండ్రి మాటల అనంతరం ఏం మాట్లాడతారు? ఏం బదులిస్తారు? అన్యాయం జరిగితే ఆ అంశంపై మాట్లాడాలే కానీ.. దానికి కులం రంగు అంటించే మేధావులు రోహిత్ తండ్రి మాటకు ఇప్పుడేం సమాధానం చెబుతారు?