పొరుగు రాష్ట్రమైన కన్నడ ఎన్నికల ఉత్కంఠకు శుభం కార్డు పడిన సంగతి తెలిసిందే. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడం, కర్ణాటక సీఎంగా యడ్యూరప్ప (బీజేపీ) ప్రమాణ స్వీకారం చేయడం...మూడు రోజుల తర్వాత సరైన బలం లేకపోవడంతో సీఎం పదవికి రాజీనామా చేయడం కూడా మనకు తెలిసిందే. దీని తర్వాత అందరి చూపు ఎవరు సీఎం...ఎవరు డిప్యూటీ సీఎం అనే అంశంపై పడింది. ఇదే సమయంలో జేడీఎస్ నేత, కాబోయే కర్ణాటక సీఎం కుమారస్వామి వైపు మళ్లింది. ఇక నెటిజన్లు గూగుల్‌లో కుమారస్వామి పర్సనల్ ప్రొఫైల్ గురించి వెతకడం ప్రారంభించారు.సెర్చింగ్ సమయంలో కుమారస్వామి రెండో భార్య రాధిక అనూహ్యంగా తెరపైకి వచ్చారు. అంతేకాదు ఆమె ట్రెండింగ్‌లో టాప్‌లో ఉన్నారు. రాధికా కుమారస్వామి మే 18న గూగుల్ సెర్చింగ్‌లో మోస్ట్ ట్రెండింగ్‌లో ఉన్న వ్యక్తిగా నిలిచారు.
నెటిజన్లు ఇంతగా రాధిక గురించి వెతికేందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి. రాధిక ఎవరో కాదు ప్రముఖ కన్నడ నటి. కన్నడ సినిమాల్లో రాధిక హీరోయిన్‌గా నటించారు. సినీ నిర్మాత నుంచి సీఎం స్థాయి వరకు ఎదిగిన కుమారస్వామి నటి రాధికను 2006లో రెండో పెళ్లి చేసుకున్నారు. కుమారస్వామి ఇదే (2006) సంవత్సరంలో కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరికి షమికా కే స్వామి అనే కూతురు కూడా ఉంది. మరోవైపు రాధికకు కూడా ఇది రెండో వివాహం. రాధిక మొదటి భర్త గుండెపోటుతో చనిపోయాడు. రాధికా కుమారస్వామి ఫ్యామిలీ ఫొటోలు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి. అయితే కుమారస్వామి, రాధిక వివాహంపై మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడం గమనార్హం.ఆయన రెండో వివాహంపై కేసు దాఖలైనా ఆధారాల్లేవని కర్ణాటక హైకోర్టు కొట్టేసింది. కాగా, కాగా కుమారస్వామి 1986 మార్చి మూడో తేదీన అనితను వివాహం చేసుకున్నారు. వారిద్దరికి నిఖిల్ గౌడ అనే కొడుకు ఉన్నారు.