ఖ‌త‌ర్నాక్ మొగుడు: భార్యను నరికేసి.. నివాళుల‌ర్పించాడు!

Update: 2022-11-18 02:30 GMT
మొగుళ్ల‌లో వీడు ఖ‌త‌ర్నాక్ మొగుడు! అని అనిపించాడు ఓ భ‌ర్త‌. క‌ట్టుకున్న భార్య‌ను క‌ర్క‌శంగా న‌రికేశాడు. అనంత‌రం.. ఏమీ తెలియ‌ని అమాయ‌కుడి మాదిరిగా.. భార్య శవానికి వెంట‌నే రెండు పూల దండ‌లు వేసి ..చుట్ట‌ప‌క్క‌ల వాళ్ల‌ను పిలిచి నివాళి అర్పించి.. సంతాపం తెలిపాడు. దీంతో బెంబేలెత్తిన జ‌నాలు.. ప‌రుగు ప‌రుగున పోలీసుల‌కు క‌బురు పెట్టారు. గుంటూరు జిల్లా తెనాలిలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న సంచ‌ల‌నం సృష్టించింది.

విష‌యం ఇదీ..

గుంటూరు జిల్లా తెనాలిలోని గాంధీనగర్లో నివాసం ఉంటున్న కాకర్ల కోటేశ్వరరావు, స్వాతిలకు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు సంతానం ఉన్నారు. స్వాతి బ్యూటీపార్లర్ నిర్వహిస్తుంది. ఈ క్రమంలో కోటేశ్వరరావుకు అప్పులు కావడంతో.. పెళ్లి సమయంలో భార్య స్వాతికి పుట్టింటి నుంచి సంక్రమించిన స్థలం అమ్మి అప్పులు తీర్చాలని పట్టుబట్టాడు.

ఈ విష‌యంపై నెలరోజుల క్రితం స్వాతిని కొట్టడంతో పుట్టింటికి వెళ్లింది. తిరిగి కొన్ని రోజుల తర్వాత భర్త ఇంటికి వచ్చింది. తాజాగా ఇరువురి మధ్య మళ్లీ వివాదం జరిగి.. స్వాతిపై దాడి చేశాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు కోటేశ్వ‌ర‌రావును హెచ్చ‌రించి వ‌దిలేశారు. కానీ.. త‌న‌పైపోలీసుల‌కు ఫిర్యాదు చేసింద‌నేక‌క్ష‌తో బ్యూటీ పార్లర్లో  ఒంట‌రిగా ఉన్న స్వాతిపై  కత్తితో  మెడ మీద నరికాడు.

ఆమె మృతి చెందిందని నిర్ధారించుకొని.. తన వెంట తెచ్చుకున్న రెండు పూలదండలను ఆమె మెడలో వేసి.. నివాళుల‌ర్పించాడు. చుట్టుప‌క్క‌ల వారిని కూడా పిలిచి.. సంతాపం ప్ర‌క‌టించాడు. అనంతరం  పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News