ఇప్పుడు చెప్పే ఉదంతం లాంటివి ఇంతకు ముందు విని ఉండకపోవచ్చు. విన్నంతనే ఉలిక్కిపడేలా ఉన్న ఈ ఉదంతం తీవ్ర గగుర్పాటుకు గురి చేయటమే కాదు.. ఇలాంటివి అసలు జరుగుతాయా? లేదంటే కల్పించి చెబుతున్నారా? అన్న సందేహాలు వెల్లువెత్తుతున్న వేళ.. వాటికి సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. అమెరికాలో చోటు చేసుకున్న ఈ ఉదంతం ఇప్పుడు షాకింగ్ గా మారింది. అసలేం జరిగిందంటే..
అమెరికాలోని మేరీలాండ్ కు సంబంధించి చార్లెస్ కౌంటీ అనే ప్రాంతంలో నివసించే ఒక వ్యక్తి హటాత్తుగా కనిపించకుండా పోయాడు. దీంతో.. అతడి ఇంటికి పొరుగు ఇంటి వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన.. కనిపించకుండా పోయిన వ్యక్తి ఇంట్లో ఏమైనా ఉన్నాడన్న ఉద్దేశంతో అతడి ఇంటికి వెళ్లి.. బలవంతంగా తలుపులు తెరిచారు. లోపలి సీన్ చూసి షాక్ తిన్నారు.
అతడి ఇంట్లో 125 వరకు పాములు ఉండటం ఒక ఎత్తు అయితే.. అవన్నీ మరణించిన అతడి చుట్టూనే తిరుగుతున్నాయి. మరణించిన వ్యక్తి.. పాముల్ని పెంచుతాడని భావిస్తున్నారు. ఈ పాముల్లో అత్యంత విషపూర్వకమైన కోబ్రాలు ఉన్నాయని.. 14 అడుగులు ఒక కొండచిలువ ఉందని చెబుతున్నారు. తొలుత ఇంట్లోని పాముల్ని పట్టుకున్న వాలంటీర్లు.. వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే.. ఇంట్లో ఇన్ని పాముల్ని ఏ మాత్రం అంచనా వేయలేని వారంతా తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నారు.
అయితే.. ఇంట్లో ఉన్న పాములు అందరూ అనుమానిస్తున్నట్లుగా తప్పించుకున్నాయన్న వాదనలో నిజం లేదంటున్నారు. అసలు బయటకు వెళ్లే అవకాశమే లేకుండా అక్కడి పరిస్థితులు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఏమైనా. మరణించిన వ్యక్తి అసలెలా మరణించాడు..? దానికి కారణం ఏమిటన్న విషయంపై పోలీసులు ప్రత్యేకంగా ఫోకస్ పెడుతున్నారు. మరి.. వారి విచారణలో వెలుగు చూసే వ్యవహారాలు ఏమేం బయటకు వస్తాయో?.. చూడాలి.