సాధారణంగా ఎవరికైనా బోర్ కొడితే ఏం చేస్తారు?... మొబైల్‌లో గేమ్స్ ఆడుకుంటారు లేదా సినిమా చూస్తారు లేదా ఫ్రెండ్స్‌తో మందు కొడతారు.. పేక ఆడతారు లేదా సరదాగా బయటకు పోయి తిరిగొస్తారు.
కానీ బ్రిటన్‌లో ఒక వ్యక్తి తనకు బోర్ కొడుతోందని ప్రమాదకరమైన పనికి దిగాడు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర మొక్కను తెచ్చి దాన్ని జాగ్రత్తగా పెంచుతున్నాడు.
వివరాల్లోకి వెళ్తే.. బ్రిటన్‌కు చెందిన డేనియల్ ఎమీలైన్ జోన్స్ తన బోర్, విసుగును దూరం చేసుకునేందుకు ఈ భూమి మీద ఎవరూ చేయని పనిని చేస్తున్నాడు. డెండ్రోస్నైడ్ మోరోయిడెస్ అనే అత్యంత ప్రమాదకరమైన మొక్కను పెంచుతున్నాడు.
డెండ్రోస్నైడ్ మోరోయిడెస్ మొక్కను ముద్దుగా జింపీ–జింపీ అని కూడా పిలుస్తారు. సూసైడ్‌ప్లాంట్‌గా కూడా దీనికి మరో పేరు ఉండటం గమనార్హం. దానికి ఉండే ముళ్లు గనుక గుచ్చుకుంటే.. ఆ నొప్పి కొన్ని నెలలపాటు ఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు.. ఆ మొక్క పరిసరాల్లో కనుక మనం ఉంటే ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కలుగుతాయంట.
జింపీ–జింపీకి ఆస్ట్రేలియన్ స్టింగింగ్ ట్రీ అనే పేరు కూడా ఉందని తెలుస్తోంది. దీనిని అత్యంత విషపూరితమైన మొక్కగా పరిగణిస్తున్నారు. దాని ముళ్లు గుచ్చుకుంటే ఒకేసారి యాసిడ్ మీద పడినట్లు.. కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపిస్తుందట.
కాగా ఈ మొక్కను పెంచుతున్న డేనియల్ ఎమీలైన్ జోన్స్.. బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ట్యూటర్‌గా పనిచేస్తున్నాడు. తనకు బోర్ కొట్టడంతో ఆస్ట్రేలియా నుంచి విత్తనాలు తెచ్చి ఈ మొక్కను పెంచుతున్నాడట.
తన విసుగును పోగొట్టుకునేందుకు ఇలాంటి ప్రమాదకరమైన మొక్కను తెచ్చుకున్నాడట. దాన్ని చాలా జాగ్రత్తగా పెంచుతూ తన బోర్‌ను తరిమేస్తున్నాడట!
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.