కేటీఆర్ భ‌య‌ప‌డిందంతా జ‌రిగిందిగా?

Update: 2017-06-08 07:05 GMT
రెండు రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య ఒక‌టి చేశారు. వ‌ర్షాలు రానున్నాయ‌న్న విష‌యాన్ని ప్రస్తావిస్తూ.. వ‌ర్షం ప‌డితే హైద‌రాబాద్ మ‌హాన‌గ‌ర ప‌రిస్థితి ఇబ్బందిక‌రంగా మారుతుంద‌న్న మాట‌ను చెప్ప‌ట‌మే కాదు.. హైద‌రాబాద్ వ‌ర‌కూ వ‌ర్షం ప‌డ‌కున్నా ఏం కాదంటూ వ్యాఖ్య‌లు చేశారు. దీనిపై ప‌లువురు తీవ్రంగా మండిప‌డ్డారు.

అధికారంలోకి మూడేళ్లు అయినా.. ఇప్ప‌టికీ హైద‌రాబాద్ సివరేజ్ సిస్టంను ఇంత వ‌వ‌ర‌కూ ఒక కొలిక్కి రాక‌పోగా.. వ‌ర్షాలు కుర‌వ‌కుంటే బాగుండ‌న్న మాట‌ల్ని కేటీఆర్ ఎలా చెబుతారంటూ ప‌లువురు ఫైర్ అయ్యారు. ఇదిలా ఉంటే.. ఈ రోజు (గురువారం) తెల్ల‌వారు జాము నుంచి అక్క‌డా ఇక్క‌డా అన్న‌తేడా లేకుండా హైద‌రాబాద్ మ‌హాన‌గ‌ర‌మంతా భారీ వ‌ర్షం కురిసింది.

మంత్రి కేటీఆర్ ఏదైతే వ‌ద్ద‌నుకున్నారో.. ఆయ‌న అనుకున్న రెండు రోజుల‌కే వ‌ర్షం ప‌డ‌టం.. ఆయ‌న భ‌య‌ప‌డిన‌ట్లే న‌గ‌రం చిగురుటాకులా వ‌ణికిపోవ‌టం జ‌రిగింది. రోడ్ల మీద ఎక్క‌డిక‌క్క‌డ నిలిచిన నీళ్ల‌తో ట్రాఫిక్ జాం కావ‌టం.. ఆఫీసుల‌కు వెళ్లే వారు గంట‌ల కొద్దీ రోడ్ల మీదే నిలిచిపోవ‌టం.. లోత‌ట్టు ప్రాంతాల‌న్నీ జ‌ల‌మ‌యం కావ‌టం లాంటి పాత స‌మ‌స్య‌ల‌న్నీ ఒక్క‌సారిగా విరుచుకుప‌డ్డాయి. నిన్న‌టి వ‌ర‌కూ ఎండ‌తో మాడిపోయిన న‌గ‌ర జీవి.. కాసిన్ని వానకు చ‌ల్ల‌గా సేద తీరుదామ‌ని అనుకున్నా.. వ్య‌వ‌స్థ‌లోని లోపాల కార‌ణంగా చెమ‌ట‌లు కార్చాల్సిన ప‌రిస్థితి. ఇదిలా ఉంటే.. మొన్నీ మ‌ధ్య‌నే చ‌క్క‌గా త‌యారైన న‌గ‌ర రోడ్లు.. తాజా వాన‌ల‌తో మ‌ళ్లీ నాశ‌న‌మైపోతాయా? అన్న సందేహాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఏమైనా.. తాజాగా కురిసిన వాన‌తో హైద‌రాబాదీయులు తీవ్ర క‌ష్టాల‌కు గుర‌య్యార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News