గ్రౌండ్ రిపోర్టు: భారీ వర్షానికి తిరుమల.. తిరుపతి ఎందుకంత అతలాకుతలమైంది?
నిజమే.. భారీ వర్షమే కురిసింది. కాదని ఎవరూ అనరు. కానీ.. అంత మాత్రానికే ప్రపంచ ఆధ్యాత్మిక చిత్రపటంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న తిరుపతి.. తిరుమల పట్టణాలు ఎందుకంతలా వణికాయి? భారీ వర్షానికి అతలాకుతలమైన తీరు ఇప్పుడు కొత్త ప్రశ్నలకు తెర తీసింది.
తిరుపతి పట్టణంలోని ప్రజలు ఎవరూ కూడా అత్యవసరం కాకుంటే ఇళ్లల్లో నుంచి బయటకు రావొద్దంటూ అధికారులు స్వయంగా ప్రకటనలు చేయటం చూస్తే.. తిరుపతి పట్టణంలో వర్షపు తీవ్రత.. ప్రజలు బయటకు రాకూడనంత ఎక్కువగా ఉందా? అంటే అవుననే చెప్పాలి. రోడ్లు సెలయేర్లు మాదిరి మారటం.. లోతట్టు ప్రాంతాల్లో నడుం లోతు నీళ్లతో నిండిపోవటమే కాదు.. తిరుమల పట్టణం ఒకలా ఇబ్బంది పడుతుంటే.. తిరుపతి పట్టణం మరోలా ఇబ్బందులకు గురవుతోంది.
ఇక.. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే మార్గం దారుణంగా దెబ్బ తింది. రవాణా సౌకర్యానికి ఆటంకం కలిగేలా భారీ నష్టం వాటిల్లటంతో.. జరిగిన నష్టాన్ని తీర్చి.. యథావిధి పరిస్థితుల్ని నెలకొల్పటానికి మరికొంత సమయం పట్టేలా ఉందని చెప్పక తప్పదు. అంతేకాదు.. నడక మార్గంలో తిరుమలకు చేరుకునే వారు ఎవరూ రావొద్దంటూ టీటీడీఅధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇంత పరిస్థితికి కారణం ఏమిటి? ఎవరు దీనికి బాధ్యులు అన్న విషయంలోకి వెళితే..
భౌగోళికంగా చూస్తే.. తిరుపతి తిరుమల పట్టణాలు బంగాళాఖానికి సమీపంలో ఉండటం వర్ష తీవ్రత ఎక్కువగా ఉండటానికి కారణంగా చెప్పొచ్చు.
తిరుపతి నుంచి తడ వంద కిలోమీటర్ల దూరంలోనేఉంది. అయితే.. పాలకుల నిర్లక్ష్యం.. అధికారుల్లో జవాబుదారీతనం మిస్ కావటం.. ప్రజలు బాధ్యతగా వ్యవహరించకపోవటం కూడా తాజా పరిస్థితులకు కారణంగా చెప్పాలి. అప్పుడెప్పుడో రాయలవారి కాలంలో తిరుపతిలో అనేక గుంటలు తవ్విస్తే.. ఇప్పుడు అవన్నీ ఆక్రమణలకు గురయ్యాయి. వాటిల్లో కేశవాయనగుంట.. మల్లయ్య గుంట.. తాతయ్య గుంట.. తాళ్లపాక చెరువు.. కొరమీను గుంట లాంటి గుంటలన్ని ఆక్రమణలకు గురి కావటం కూడా ఒక కారణంగా చెప్పాలి.
నీళ్లు ఎప్పుడూ తన గతాన్ని మర్చిపోవు. తాను పారిన దారిని గుర్తుపెట్టుకొని అదే బాటలో పయనిస్తాయని.. ఈ కారణంతోనే.. భారీ వర్షం కురిసినప్పుడు వర్షపు నీరు తన దారిన తాను పోతూ.. తనను అడ్డుకునే ఆక్రమణల్ని ముంచెత్తుతూ ముందుకు సాగుతూ ఉంటుంది. తిరుమల నుంచి వచ్చే వర్షపు నీరు తిరుపతికి ఇరుగునే ఉండే తిరుచానూరు దక్షిణ భాగంలోని స్వర్ణముఖి నదిలో కలుస్తుంటుంది. అయితే.. ఈ ప్రాంతమంతా కుంచించుకుపోవటం.. ఆక్రమణలకు గురి కావటం కూడా తాజా దుస్థితికి కారణంగా చెప్పక తప్పదు.
మల్లయ్య గుంటపై కూరగాయల మార్కెట్.. తాళ్లపాక చెరువుపైన ఆర్టీసీ బస్టాండ్ నిర్మించిన నేపథ్యంలో వర్షపు నీరు రోడ్ల మీదకు వచ్చి ముంచెత్తుతోంది. కపిలతీర్థం.. మాల్వాడిగుండం నుంచి వచ్చే జలపాతం నీరంతా తిరుపతి నుంచి ప్రవహిస్తూ స్వర్ణముఖి నదిలోకలవాలి. కానీ.. ఆ దారిన అన్ని ఆక్రమణలకు లోనుకావటంతో లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు మొత్తం నీట మునుగుతున్న పరిస్థితి. మిగిలిన పట్టణాలతో పోలిస్తే తిరుపతి పట్టణం భౌగోళికంగా కాస్త భిన్నమైనది. పడమర.. తూర్పు ప్రాంతాలు ఎత్తుగా ఉంటాయి. ఉత్తర ప్రాంతం కొండలు ఉండటంతో నీటి ప్రవాహానికి దక్షిణమే దిక్కు. అయితే.. జలవనరుల విద్వంసంతో వరదనీరు అక్కడే నిలిచిపోతోంది.
తిరుపతి మాస్టర్ ప్లాన్ ను సరిగా రూపొందించకపోవటం.. దాన్ని అమలు చేసే విషయంలో దొర్లిన నిర్లక్ష్యానికి ఇప్పుడు మూల్యం చెల్లించక తప్పని పరిస్థితి. తిరుపతి చెంతనే ఉండే కొండలు కారణంగా తిరుపతి వాసులు భయంతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు. కొండల మీద నుంచి వచ్చే వరద నీటితో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు మునిగిపోతుంటాయి. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరదనీరు పారేందుకు వీలుగా ఉండే కాలవల్లో పూడికతీత సరిగా తీయకపోవటం.. రైల్వే అండర్ బ్రిడ్జిల ప్రాంతాల్లో నాలాలు పూడుకుపోవటం కూడా ఇప్పుడున్న పరిస్థికి కారణంగా చెప్పాలి.
తిరుమలకు వెళ్లే ప్రధాన దారి పేరు కొర్లగుంట. ఇందులోనే ఇక్కడో నీటి వనరు ఉందన్న విషయం అర్థమవుతుంది. భౌతికంగా చూస్తే ఇప్పుడు అక్కడ ఎలాంటి చెరువు లేదు. ఇదొక్కటి చాలు.. తిరుపతి..తిరుమలకు జరిగిన డ్యామేజ్ ఏమిటన్నది అర్థమవుతుంది. ఆక్రమణల్లో మునిగిన కాలువల్ని పునరుద్ధరిస్తే తప్పించి తిరుపతి పట్టణం ముంపు నుంచి తప్పించుకునే అవకాశమే లేదని చెప్పాలి.