హైదరాబాద్ లో భారీ వర్షం ... సెల్లార్ ‌లో చిక్కుకొని హైకోర్టు ఉద్యోగి మృతి

Update: 2020-10-10 12:10 GMT
హైదరాబాద్ మహానగరంలో శుక్రవారం కురిసిన భారీ వర్షాలకు ఓ వ్యక్తి మృతి చెందారు. ఈ విషాదసంఘటన నగరంలోని ముషీరాబాద్ ప్రాంతంలో జరిగింది. హైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షాలకి రోడ్లు, లోతట్టు ప్రాంతాలు, సెల్లార్లన్నీ జలమయం అయ్యాయి. ఈ క్రమంలోనే ముషీరాబాద్ కేర్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న శ్రీ సాయి అపార్ట్మెంట్లో కూడా భారీగా వరద నీరు చేరింది. దీంతో అపార్ట్ మెంట్ సెల్లార్ చెరువును తలపించింది. దీనితో సెల్లర్ లో చిక్కుకొని 54 ఏళ్ల వ్యక్తి మృతి చెందారు.

ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లో వెళ్తే ... హైకోర్టు లో పనిచేసే బి రాజ్ కుమార్ నిన్న రాత్రి 7:30 ప్రాంతంలో స్పెన్సర్ షాపింగ్ మాల్ కి వెళ్తా అని కుటుంబ సభ్యలతో చెప్పి కిందికి దిగారు. సెల్లార్ లో భారీగా వరద నీరుచేరడంతో ఆ వ్యక్తి అక్కడే చిక్కుకుని ప్రమాదవశాత్తు మృతి ‌ చెందాడు. అయితే సెల్లార్‌ లో వాన నీరు చేరి విద్యుత్ షాక్‌ కు గురై రాజ్ కుమార్ మృతిచెందినట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే మృతుని కుమారుడు ముషిరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ తో రాజ్ కుమార్ చనిపోయారా.. లేక మరే ఇతర కారణాలతో చనిపోయాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Tags:    

Similar News