గత కొన్ని రోజులుగా హైదరాబాద్ నగరాన్ని వర్షాలు వెంటాడుతున్నాయి. ఆకాశానికి చిల్లు పడ్డట్టుగా కుండపోతగా కురుస్తూ వర్షాలు నగరాన్ని ముంచెత్తున్నాయి. బుధవారం సాయంత్రం కూడా ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి నగరం నీట మునిగింది. నగరంలోని చాలా ప్రాంతాల్లో జోరు వాన కురిసింది. ఫలితంగా రోడ్లన్ని వాగులని తలపిస్తున్నాయి. పైగా ఉద్యోగులు ఇళ్లకు వెళ్ళే సమయం కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వారు ఇళ్లకు చేరుకునేందుకు గంటల సమయం పట్టింది.
హైదరాబాద్ లోని మణికొండ - విజయనగర్ కాలనీలోని ఫుట్ బాల్ గ్రౌండ్ - కవాడిగూడ - రెడ్‌హిల్స్ - శ్రీనగర్ కాలనీ - గణాంక భవన్ - సెస్ లో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా సరాసరి 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ తెలిపింది. ఇటు బంజారాహిల్స్ - జూబ్లీహిల్స్ - మాదాపూర్ - పంజాగుట్ట - అమీర్ పేట్ - ఎర్రగడ్డ - ఎస్ ఆర్ నగర్ - మూసాపేట - ఖైరతాబాద్ - కోఠి - ఉప్పల్ - కూకట్ పల్లి ప్రాంతాల్లో కుండపోత వాన పడింది.
మంగళవారం కూడా హైదరాబాద్ నగరంలో రికార్డ్ స్థాయిలో వర్షం పడింది. ఈ వర్షాలకు పాత భవనాలు ఎక్కడ కూలుతాయోనని భయపడుతున్నారు. హోర్డింగులు పడిపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జీహెచ్ ఎంసీ అధికారులు దృష్టి పెట్టారు. అయితే ఆదివారం కూడా భారీగా వర్షం పడగా.. అమీర్ పేట్ మెట్రో స్టేషన్ లో యువతిపై పెచ్చులు ఊడిపడి చనిపోయిన విషయం తెలిసిందే.
కేవలం నగరంలోనే కాకుండా..తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడ్డాయి. బుధవారం నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లిలో అత్యధికంగా 11.18 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదు కాగా - బాల్కొండలో 11.15 సెం.మీ. వర్షం కురిసింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ - మెదక్ జిల్లా శంకర్ పేటలో 7 సెం.మీ. చొప్పున వర్షం కురిసింది. పెద్దపల్లి - కరీంనగర్ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది.
హికా తుఫాన్...
ఇదిలా ఉంటే రెండు తెలుగు రాష్ట్రాలకి ‘హికా’ తుఫాన్ ప్రమాదం పొంచి ఉంది. తుఫాను ప్రభావంతో అరేబియా తీరంలో గంటకు 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసింది. వచ్చే 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. అలాగే - తమిళనాడు - కర్ణాటక - పుదుచ్చేరి - కేరళలోనూ భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.