ప్రపంచానికే పెద్దన్న పోస్టులో ఉన్న ఆమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఆయన గారాల పట్టి ఇవాంక ట్రంప్. ఎవరి మీదనైనా నోరు పారేసుకునే ట్రంప్.. తన కూతురి విషయంలో మాత్రం మినహాయింపుగా చెప్పాలి. అంతేనా.. తన కుమార్తె అంటే తనకెంతో ఇష్టమో చెబుతుంటారు. ట్రంప్ సర్కారులో కీలకభూమిక పోషిస్తున్న ఇవాంక ట్రంప్.. తన సామర్థ్యాన్ని వివిధ వేదికల మీద ఇప్పటికే చాటుకున్నారు.
తాజాగా ఆమె.. తన భర్తతో కలిసి ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం చోటు చేసుకోవటంతో పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఇవాంకా..ఆమె భర్తతో పాటు వ్యక్తిగత భద్రతా సిబ్బందితో కలిసి ప్రయాణిస్తున్న రెండిజన్ల హెలికాఫ్టర్ లో రెండు ఇంజిన్లు ఫెయిల్ అయిన వైనం ఆలస్యంగా బయటకు వచ్చింది.
అమెరికా అధ్యక్షుడి కుమార్తె హెలికాఫ్టర్ లో ప్రయాణించాల్సిన అవసరం ఏమొచ్చింది. దీనికి కారణం ఏమిటి? అన్న అంశంపై విచారణ జరుపుతున్నారు. ఇవాంక దంపతులు వాషింగ్టన్ డీసీ నుంచి న్యూయార్క్ వెళుతుండగా.. వారు ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం చోటు చేసుకుంది.
వారు ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ రెండు ఇంజిన్లు పని చేయకపోవటంతో అప్పటికప్పుడు.. వాషింగ్టన్ లోని రొనాల్డ్ రీగన్ ఎయిర్ పోర్టుకు మళ్లించారు. అక్కడ సేఫ్ గా ల్యాండ్ చేశారు. అక్కడ నుంచి న్యూయార్క్ కు మరో విమానంలో వెళ్లారు. ఇవాంకా దంపతులు ప్రయాణించిన హెలికాఫ్టర్ లో ఒక పైలెట్ మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. హెలికాఫ్టర్ లో చోటు చేసుకున్న సాంకేతిక లోపంపై నిఘా వర్గాలు ఆరా తీసే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది.