ఈ హెల్మెట్‌ వస్తే.. ఎందరో బతుకుతారు

Update: 2015-04-09 17:30 GMT
దేశంలో ప్రతిభకు కొదవలేదు. కాసింత ప్రోత్సాహం.. మరికాస్త వెన్నుదన్నుగా నిలిస్తే చాలు.. తాము ఏదైనా చేయగలమని నిరూపిస్తున్నారు దేశంలోని యువత. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా నగరానికి చెందిన ఓ కుర్రాడు తయారు చేసిన హెల్మెట్‌ ఇప్పుడు పలువుర్ని ఆకర్షిస్తోంది. ఈ హెల్మెట్‌కు కొన్ని మార్పులు చేసి.. చట్టబద్ధం చేస్తే.. దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల కారణంగా మరణిస్తున్న వేలాది మందిలో చాలామంది బతికే అవకాశం పక్కా అంటున్నారు.

ఇంతకీ ఈ హెల్మెట్‌ ప్రత్యేకత ఏమిటంటే.. ఈ హెల్మెట్‌ను పెట్టుకుంటేనే బండి స్టార్ట్‌ అయ్యేలా ఏర్పాట్లు చేశారు. బండి ఇంజిన్‌లో చేసిన కొన్ని మార్పులతో ఇది సాధ్యమైంది. అంటే.. హెల్మెట్‌ తీస్తే బండి స్టార్ట్‌ కాదు. హెల్మెట్‌ పెట్టుకుంటు తప్ప బండి ముందుకు కదలని పరిస్థితి. ఈ సాంకేతికతను చూసి ఉత్తరప్రదేశ్‌ సీఎం అఖిలేష్‌ యాదవ్‌ సైతం మురిసిపోయారు.

ఈ సాంకేతికతను రూపొందించిన అగ్రా కుర్రాడు హిమాంశుకు రూ.5లక్షల రివార్డును ప్రకటించారు. ఈ సాంకేతికతను అన్ని ద్విచక్రవాహనాలకు అమలు చేసి.. ప్రతి కంపెనీ తప్పనిసరిగా దీన్ని వాడాలని నిబంధన పెడితే.. రోడ్డు ప్రమాదాల కారణంగా మరణించే వారి సంఖ్య చాలా తగ్గే వీలుంది. మరి.. ప్రభుత్వం ఈ సాంకేతికతను ఏ విధంగా వాడుతుందో కాలమే సమాధానం చెప్పాలి.

Tags:    

Similar News