కరోనా వైరస్ ఏ ప్రదేశంలో ఎంతకాలం జీవిస్తుందంటే?

Update: 2020-03-27 00:30 GMT
కరోనా వైరస్ ..ఈ పేరు వింటేనే  - ప్రపంచం మొత్తం భయంతో వణికిపోతోంది. కరోనా దెబ్బ కి మొత్తం ప్రపంచమే లాక్ డౌన్ అయిపోయింది. ఒక దేశం నుండి మరొక దేశానికీ పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. కరోనా కి ఇప్పటివరకు కూడా సరైన మందు లేకపోవడం..ముందు జాగ్రత్త చర్యలే ప్రాణాలని కాపాడగలవు అని నిపుణులు చెప్తుండటంతో ప్రతి ఒక్కరు కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. బహిరంగ ప్రాంతాల్లో జనం మోచేత్తో తలుపు తీస్తుండడం - రైళ్లలో ప్రయాణికులు హాండిల్ కూడా పట్టుకోకుండా నిలబడి ఉండడం - ఆఫీసుల్లో ఉదయాన్నే ఉద్యోగులు తమ డెస్కులు శుభ్రం చేసుకుంటూ ఉండడం మనకు కనిపిస్తోంది.

పీల్చడం ద్వారా వచ్చే ఫ్లూ వైరస్ లాగే, కరోనా  ఉన్న వ్యక్తి దగ్గినపుడు అతడి ముక్కు - నోటి నుంచి వచ్చిన చిన్న తుంపర్ల ద్వారా ఈ వైరస్ వ్యాపించవచ్చు. చిన్నగా దగ్గినా మూడు వేలకు పైగా తుంపర్లు బయటికి వస్తాయి. ఇవి మిగతా వారిపై - చుట్టూ ఉన్న బట్టలు - ఇతర ఉపరితలాలపై పడతాయి. కానీ, కొన్ని చిన్న అణువులు ఇంకా గాల్లోనే ఉండిపోతాయి. వైరస్ మలంలో కూడా ఎక్కువసేపు ఉంటుందనడానికి కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. అందుకే ఎవరైనా టాయిలెట్ వెళ్లిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోకుంటా దేన్నైనా ముట్టుకుంటే - వాటిని వైరస్‌ తో కలుషితం చేసే ప్రమాదం ఉంది.

అసలు ఈ వైరస్ దేనిపై ఎంతకాలం ఉంటుంది అంతే .. ఏదైనా ఉపరితలం లేక ఏదైనా వస్తువును తాకి - అదే చేతుల్తో తమ ముఖాన్ని తాకడం అనేది వైరస్ వ్యాపించడానికి ప్రధాన కారణం కాదు అని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ చెప్పింది. అయితే, సీడీసీ - ప్రపంచ ఆరోగ్య సంస్థ - ఇతర ఆరోగ్య సంస్థలు అన్నీకరోనా  వ్యాప్తిని అడ్డుకోడానికి మనం చేతులు శుభ్రంగా కడుక్కోవడం, తరచూ తాకే ఉపరితలాలను క్రిమిరహితం చేయడం రెండూ ముఖ్యమే అని చెప్తుంది. ఉపరితలాలు తాకడం వల్ల ఎన్ని కేసులు నమోదయ్యాయో మనకు ఇప్పటికీ కచ్చితంగా తెలీకపోయినా - జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.

కరోనా వైరస్  లోహం - గ్లాస్ - ప్లాస్టిక్ మీద 9 రోజుల వరకూ బతకగలదు - వాటిలో కొన్ని బయట కనిష్ట ఉష్ణోగ్రతల్లో 28 రోజుల వరకూ సజీవంగా ఉంటాయిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ముఖ్యంగా ఎక్కడైనా తట్టుకుని జీవించగలిగే సామర్థ్యం ఉన్న వైరస్‌ లలో కరోనావైరస్‌ లు చాలా ముఖ్యమైనవి అని తెలిపారు. సార్స్-CoV-2 వైరస్ వివిధ ఉపరితలాలపై ఎంత కాలం ఉండగలదు అనేదానిపై అమెరికా నేషనల్ ఇన్‌ స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్   వైరాలజిస్ట్ నీల్టిజే వాన్ డోరెమాలెన్ మొదటిసారి కొన్ని పరీక్షలు చేశారు.ఒక వ్యక్తి దగ్గితే వచ్చే తుంపర్ల రూపంలో ఈ వైరస్ సజీవంగా ఉంటుందని.

వీటిలో పెద్ద తుంపర్లు 1 నుంచి 5 మైక్రోమీటర్ల పరిమాణంలో ఉంటాయని - అంటే మనిషి వెంట్రుక కంటే 30 రెట్లు చిన్నగా ఉండే ఆ వైరస్ నిశ్చలంగా ఉన్న గాలిలో కొన్ని గంటలపాటు ఉంటుందని చెప్పారు.. అంటే, వడపోత లేని ఏసీల నుంచి వచ్చే వైరస్ కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది. ముఖ్యంగా గాలి తుంపర్లలా వేగంగా చిమ్మే వైరస్ చెదిరిన గాలిలో ఉపరితలాలపై వేగంగా స్థిరపడుతుంది. కానీ, ఎన్ ఐహెచ్ అధ్యయనంలో సార్స్- CoV-2 వైరస్ కార్డుబోర్డు మీద 24 గంటల వరకూ ఉంటుందని - ప్లాస్టిక్ - స్టెయిన్‌ లెస్ స్టీల్ మీద అది 2-3 రోజులపాటు ఉండగలదని కొన్ని పరీక్షల్లో తేలింది.
Tags:    

Similar News