గ్రామస్తుల సెంటిమెంట్ ను గౌరవించిన ‘హీరో’

Update: 2017-02-17 07:53 GMT
రాష్ట్ర విభజన జరిగిన కొత్తల్లో.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రతి విషయంలోనూ చాలానే పోటీ ఉండేది. దీనికి తగ్గట్లేరెండు రాష్ట్రాలకు చెందిన నేతలు.. కీలక అధికారులు పోటాపోటీగా ప్రకటనలు ఇచ్చుకునే వారు. ఈ సమయంలో.. రెండు రాష్ట్రాల వారు తమ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేందుకు వస్తే కంపెనీలకు పోటాపోటీగా ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటించే పరిస్థితి.

ఇలా పోటీ పడిన వాటిల్ హీరో కార్ప్ ఒకటి. ప్రముఖ మోటార్ సైకిళ్ల కంపెనీ అయిన హీరోను తమ రాష్ట్రానికే తీసుకురావాలని రెండు తెలుగు రాష్ట్రాలు విపరీతంగా ప్రయత్నించాయి. హీరో కంపెనీని తమ రాష్ట్రానికి తీసుకెళ్లటాన్ని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పర్సనల్ ప్రిస్టేజ్ గా తీసుకోవటం కూడా జరిగిందని చెబుతారు. ఏది ఏమైనా.. ఈ వ్యవహారంలో ఏపీ సర్కారు ప్రయత్నాలు ఫలించి.. ఏపీలో తమ ఫ్లాంటు పెట్టేందుకు హీరో ఓకే చెప్పేసింది.

ఏపీలో తమ కంపెనీని పెడితే.. దక్షిణ భారతం మొత్తాన్ని కవర్ చేసే వీలు ఉండటం.. అందుకు ఏపీలోని నెల్లూరు- చిత్తూరు జిల్లాల మధ్య అయితే వ్యూహాత్మకంగా బాగుంటుందన్న ఆలోచనతో హీరో ఏపీకి ఓకే చెప్పేసింది. ఈ డీల్ ను వీలైనంత త్వరగా మెటీరిలైజ్ చేయాలన్న పట్టుదలతో ఉన్న ఏపీ సర్కారు కంపెనీకి అవసరమైన భూముల్నికేటాయించింది. అయితే.. ఈ భూముల్లో అక్కడి గ్రామస్తులు సెంటిమెంట్ గా కొలిచే గ్రామదేవతలు కొలువు తీరిన చెట్లు ఉండటంతో.. ఈ వ్యవహారం వివాదంగా మారింది.

దీంతో.. న్యాయపరమైన చిక్కులు ఎదురు కాకుండా ఉండేందుకు.. అక్కడి గ్రామస్తులతో మాట్లాడిన హీరోకంపెనీ.. గ్రామదేవత కోసం ఆలయాన్ని నిర్మించి ఇవ్వటంతో ఇక్కడి వివాదం కూల్ గా ముగిసింది. త్వరలో ఏర్పాటు కానున్న హీరో కార్ప్ కంపెనీతో.. పలు ఉద్యోగాలు వచ్చేఅవకాశంఉందని చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News