కర్ణాటకలో మూడు నెలల క్రితం ఒక వ్యక్తి హత్య జరిగింది. ఆ హత్య కేసులో కన్నడ నటి మరియు ఆమె తల్లిని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఆ హత్య కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే విచారణ లోతుగా చేస్తున్న సమయంలో హత్యలో హీరోయిన్ మరియు ఆమె తల్లి కూడా సహకరించినట్లుగా పోలీసులు నిర్థారించారు. పోలీసులు ఈ విషయంను నిర్ధారించుకున్న తర్వాత అరెస్ట్ చేయడం జరిగింది. జనవరి 29న జరిగిన హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు పూర్తిగా ఛేదించారు. కొన్ని రోజుల క్రితం హత్యకు గురి అయిన వ్యక్తితో విభేదాలు ఉన్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి ఎంక్వౌరీ మొదలు పెట్టారు.
హత్యకు గురి అయిన వ్యక్తి మరియు సదరు హీరోయిన్ ఒకే ఊరికి చెందిన వారు. అందువల్ల మొదట హీరోయిన్ వద్ద డ్రైవర్ గా హతుడు చేరాడు. ఆ తర్వాత ఆర్థిక పరమైన విభేదాలు వచ్చిన కారణంగా అతడిని డ్రైవర్ గా తీసేసింది. దాంతో అతడు మరో చోట డ్యూటీ చేస్తున్నాడు. అతడిని పనిలోంచి తీసి వేసిన తర్వాత కూడా అతడిపై హీరోయిన్ కోపంతోనే ఉంది. దాంతో అతడిని కొన్ని కారణాల వల్ల చంపాలనుకున్న వ్యక్తులకు సాయం చేసింది. హత్య జరిగిన రోజు హంతకులకు అతడి సమాచారం తెలియజేసి, హత్యలో భాగస్వామ్యం అయినట్లుగా పోలీసులు నిర్థారించి హత్య చేశారు. పలు సినిమాల్లో నటించిన హీరోయిన్ హత్య కేసులో అరెస్ట్ అవ్వడంతో కన్నడ సినీ పరిశ్రమలో చర్చనీయాంశం అయ్యింది.