అమర రాజా బ్యాటరీస్ పై హైకోర్టు ఆగ్రహం.. ఏమన్నదంటే?

Update: 2021-10-30 04:40 GMT
ఇటీవల కాలం లో తరచూ వార్తల్లో కి వస్తున్న అమరరాజా బ్యాటరీస్ సంస్థ పై ఏపీ హై కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబాని కి చెందిన ఈ సంస్థ పర్యావరణ నిబంధనల్ని పాటించటం లేదంటూ ఏపీ ప్రభుత్వం ఆరోపించటం.. అది కాస్తా రాజకీయ రంగు పులుముకోవటం తెలిసిందే. చిత్తూరు జిల్లా లోని ఈ సంస్థ పై ప్రభుత్వం కావాలనే టార్గెట్ చేసిందన్న విమర్శలు వెల్లు వెత్తాయి. ఒక దశ లో తమిళనాడుకు తరలి వెళ్లాలన్న ఆలోచన చేయటం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. అప్పట్లో ఏపీ ప్రభుత్వం చేసిన ఆరోపణల కు బలం చేకూరేలా హై కోర్టు తాజా వ్యాఖ్యలు ఉండటం గమ నార్హం.

ప్రజల ప్రాణాల కు హాని కలిగించే చర్యలను తామెంత మాత్రం సహించబోమని.. డబ్బు కంటే ప్రజల ఆరోగ్యమే తమ కు ముఖ్య మంటూ ఘాటు వ్యాఖ్య చేసిన హై కోర్టు.. ‘కాసుల కోసం ప్రజల ప్రాణాల తో ఆడుకుంటారా?’ అని ప్రశ్నించటం గమ నార్హం. పర్యా వరణ కాలుష్యాన్ని తాము తీవ్రం గా పరిగణిస్తామని పేర్కొంది. కార్మికుల రక్త నమూనాల్లో సీసం ఆనవాల్లు ఉన్నాయంటే పరిస్థితి ఎంత ఘోరం గా ఉందన్న విషయం అర్థమవుతుందని పేర్కొంది. అంతే కాదు.. సంస్థ లో పని చేసే ఉద్యోగుల ఆరోగ్య పరిస్థితుల పై నివేదిక ఇవ్వాలని కాలుష్య నియంత్రణ మండలిని ఆదేశించింది.

ఓ వైపు సంస్థ తీరు ను తప్పు పడుతూ నే.. మరో వైపు అమరరాజా బ్యాటరీస్ మూసి వేతకు సంబంధించి రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి జారీ చేసిన ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ గతం లో ఇచ్చిన మధ్యం తర ఉత్తర్వుల్ని మరో సారి పొడిగించింది. హైకోర్టు న్యాయ మూర్తులు జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా.. జస్టిస్ కృష్ణమోహన్‌ల తో కూడిన ధర్మాసనం ఉత్తర్వుల ను జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను నవంబరు తొమ్మిది కి వాయిదా వేసింది.

ఈ ఏడాది ఏప్రిల్ 30న అమర రాజా బ్యాటరీస్ సంస్థ లో కాలుష్య నియంత్రణ నిబంధనల కు విరుద్ధం గా సంస్థ తీరు ఉందని చెబుతూ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సంస్థ మూసివేత కు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యం లో సదరు ఉత్తర్వుల అమలును ఆపాలని కోరుతూ హై కోర్టును ఆశ్రయించారు. దీంతో సంస్థ మూసివేత ఉత్తర్వుల్ని అమలు కాకుండా మధ్యంతర ఉత్తర్వుల్ని జారీ చేసిన కోర్టు.. ఈ అంశం పై జరిగిన వాదనల సందర్భం గా ఘాటు వ్యాఖ్యలు చేసింది. మరో వైపు అమర రాజా సంస్థ తన వాదనల్ని వినిపిస్తూ.. తమ సంస్థ లో ఎలాంటి అధ్యయనం చేయ కుండా పీసీబీని నియంత్రించాలని కోరుతూ అమర రాజా బ్యాటరీస్ ఒక అనుబంధ పిటిషన్ ను దాఖలు చేసింది. గతానికి భిన్నం గా ఈసారి సంస్థ తీరు పై హై కోర్టు తీవ్రం గా రియాక్టు కావటం గమనార్హం.




Tags:    

Similar News