కరోనా వైరస్ కట్టడికి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై విచారించిన హైకోర్టు ప్రభుత్వానికి అక్షింతలు వేయడంతోపాటు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ లక్షణాలను ఆధారంగా చేసుకొని ఆస్పత్రిలో అమ్మిట్ చేసుకోవాలని హైకోర్టు సూచించింది.
ఆర్టీపీసీఆర్ టెస్టులు రోజుకు 30 నుంచి 40వేల టెస్టులు చేస్తున్నామని ప్రభుత్వం తెలుపగా.. ఏప్రిల్ 1 నుంచి ఇప్పటివరకు 3.47 లోలు మాత్రమే టెస్టులు చేశారని.. లెక్కల ప్రకారం 8.40 లక్షలు చేయాలి కదా అని నిలదీసింది.
పరీక్షలు ఎందుకు చేయడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. కరోనా టెస్టు లేకున్నా ప్రతీ ఆస్పత్రిలో అడ్మిషన్ ఇవ్వాలని ఆదేశించింది. కరోనా కేసులపై మీడియా బులిటెన్ విడుదల చేయాలని తెలిపింది. వలస కార్మికులకు పునరావాస చర్యలు చేపట్టాలని ఆదేశించింది.
తెలంగాణలో కోవిడ్ నియంత్రణకు ప్రత్యేక కమిటీ వేయాలని ఆదేశించింది. నైట్ కర్ఫ్యూ విధించడంతో సరిపోదని.. ప్రజలకు బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువగా తిరగకుండా చూడాలని తెలిపింది. ఎన్నికల సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించకుండా ఆంక్షలు విధించాలని ధర్మాసనం పేర్కొంది.
ఇక వైన్స్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు, సినిమా థియేటర్ల దగ్గర పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించింది. పెళ్లిళ్లు, పబ్లిక్ ప్లేసులలో ఎక్కువ జనాలు ఉండకుండా చూడాలని.. మున్సిపల్ ఎన్నికల్లో భౌతిక దూరం పాటించేలా చూడాలని ఆదేశించింది. కుంభమేళాకు వెళ్లి వచ్చేవారిని ప్రత్యేక క్వారంటైన్ లో ఉంచాలని ఆదేశించింది.