తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ కేసు విషయంలో విచారణ పూర్తయ్యింది. మొత్తం ఈ కేసులో 4 గురు కాంగ్రెస్ ఎమ్మెల్యే లు, 3 టీడీపీ ఎమ్మెల్యే లపై విచారణ జరిగింది. పలుసార్లు వాదోపవాదనల తర్వాత బుధవారం హైకోర్టు ఈ కేసు విచారణ పూర్తి చేసింది. తీర్పును మాత్రం రిజర్వ్ లో ఉంచింది. కాంగ్రెస్ కు చెందిన 4 గురు ఎమ్మెల్యే లతో పాటు టీడీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యే లు ఆయా పార్టీల గుర్తులపై గెలిచి అధికార పార్టీలోకి జంప్ అయ్యారు.
టీడీపీ నుంచి గెలిచిన సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏకంగా టీఆర్ ఎస్ లో మంత్రి పదవి కూడా చేపట్టారు. వీరిపై అనర్హత వేటు వేయాలని తెలంగాణ టీడీపీ ప్రజాప్రతినిధులు పలుసార్లు స్పీకర్ మధుసూదనాచారికి పిటిషన్ లు సమర్పించారు. దీనిపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తుండడంతో చివరకు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసులో ఇరుపక్షాల వాదోపవాదనలు విన్న హైకోర్టు ఈ రోజుతో విచారణ ముగించింది. తీర్పును మాత్రం రిజర్వ్ లో పెట్టింది.
ఇక ఇదే కేసు విషయమై గతంలో హైదరాబాద్ కు వచ్చిన రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీకి కూడా టీడీపీ ప్రజా ప్రతినిధులు ఫిర్యాదు చేయడంతో ఆయన సైతం ఆశ్చర్యపోయిన సంగతి తెలిసిందే. ఒక పార్టీ తరపున గెలిచి మరో పార్టీలో ఎలా మంత్రి అయ్యారంటూ తలసాని విషయంలో ప్రణబ్ కూడా స్టన్ అయ్యారు. విచారణ పూర్తవ్వడంతో కోర్టు తీర్పు ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది.