తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు ఉపశమనం లభించింది. ఆయన ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఎపిసోడ్ ఉత్కంఠకు ముగింపు పడింది. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ ఎస్) పార్టీ సెప్టెంబర్ 2న రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్ లో నిర్వహించబోయే ప్రగతి నివేదన సభకు ప్రభుత్వం అనుమతి మంజూరు చట్ట వ్యతిరేకమని పేర్కొంటూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (పిల్) దాఖలైన సంగతి తెలిసిందే. జోగుళాంబ-గద్వాల్ జిల్లాకు చెందిన నడిగడ్డ పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షులు పూజారి శ్రీధర్ దాఖలు చేసిన పిల్ ను అత్యవసరంగా విచారించాలని గురువారం హైకోర్టు డివిజన్ బెంచ్ ని కోరగా...నేడు ఈ పిటిషన్ ను విచారించిన ధర్మాసనం ఈ పిల్ ను కొట్టివేసింది.
ప్రగతి నివేదన సభ పేరుతో ప్రజలకు అసౌకర్యం కలగనుందని - పర్యావరణానికి హాని జరుగుతుందని పిల్ పేర్కొన్న పూజారి శ్రీధర్ ప్రభుత్వం తన నివేదికను ప్రకటించాలనుకుంటే నూతన టెక్నాలజీ ద్వారా సాంఘిక మాధ్యమాల ద్వారా చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు. ఇలా సభలు పెట్టి ప్రజలకు - పర్యావరణానికి ఇబ్బందులు కలగజేయకుండా చూడాలని పిల్ ద్వారా కోరారు. ఈ పిల్‌లో ప్రతివాదులుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి - డీజీపీ - రంగారెడ్డి జిల్లా కలెక్టర్ - టీఆర్ ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిని పిటిషన్ దారుడు చేర్చారు. ప్రగతి నివేదన సభపై దాఖలైన పిల్‌ను నేడు (శుక్రవారం) విచారిస్తామని న్యాయమూర్తులు రామసుబ్రమణియన్, జె.ఉమాదేవిలతో కూడిన డివిజన్ బెంచ్ ప్రకటించిన ఈ మేరకు ప్రతివాదుల నుంచి వివరణ స్వీకరించింది. పర్యావరణ పరిరక్షణకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేస్తామని - ఇప్పటికే సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ప్రభుత్వ అడ్వోకేట్ జనరల్ వివరణ ఇచ్చారు. ప్రభుత్వ అడ్వోకేట్ జనరల్ సమాధానంతో సంతృప్తి చెందిన ధర్మాసనం ప్రగతి నివేదన సభకు అనుమతి ఇస్తూ...ప్రజలకు - పర్యావరణానికి ఇబ్బందులు కలగకుండా నిర్వహించుకోవాలని సూచిస్తూ పిల్ ను కొట్టివేసింది