రైతుల విషయంలో కలెక్టర్ అలా చేయచ్చా : హైకోర్టు ఆగ్రహం

Update: 2021-11-02 12:50 GMT
వరివిత్తనాల అమ్మకాలపై సిద్ధిపేట కలెక్టర్ చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వరి విత్తనాలు అమ్మకూదని సిద్దిపేట కలెక్టర్ మౌఖిక ఆదేశాలు ఇచ్చారని దీనిపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు పిటీషనర్. సిద్దిపేట కలెక్టర్, తెలంగాణ ప్రభుత్వం, సిద్దిపేట వ్యవసాయ అధికారి, మండల వ్యవసాయ అధికారిని ప్రతివాదులుగా చేర్చారు. వచ్చే సంవత్సరం యాసంగికి వరి సాగు వద్దని, ఏ డీలర్ కూడా వరి విత్తనాలను అమ్మవద్దంటూ సిద్దిపేట కలెక్టర్ వార్నింగ్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ అదే జిల్లాకు చెందిన రైతు బత్తుల నారాయణ ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. వరి విత్తనాల అమ్మకాలను ప్రొహిబిషన్ యాక్ట్ లో ఏమైనా చేర్చరా అని ప్రశ్నించింది. ఈ కేసులో ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. వరి విత్తనాల అమ్మకాలను ప్రొహిబిషన్ యాక్ట్‌లో ఏమైనా చేర్చారా అని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ అలాంటిది ఏమి లేదని కోర్టుకు తెలిపారు. అలాంటి చర్యలేమి ప్రభుత్వం తీసుకోలేదని ఇకపై కూడా తీసుకోబోదని చెప్పారు. రైతుల విషయంలో కలెక్టర్ ఎలా వ్యాఖ్యలు చేస్తారని ప్రశ్నించింది హైకోర్టు. కలెక్టర్ తీరుపై అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసులో క్రిమినల్ కంటెంట్ కనబడుతోందని.. ఈ పిటిషన్ ను చీఫ్ జస్టిస్ బెంచ్‌ కు బదిలీ చేయాలని రిజిస్టార్ కు అదేశించింది.
Tags:    

Similar News