జగన్ సర్కార్ ఇచ్చిన జీవో పై హైకోర్టు స్టే ..ఎందుకంటే ?

Update: 2020-03-23 08:50 GMT
ఆంధప్రదేశ్ లో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ కి ఈ మధ్య కాలం అసలు కలిసిరావడం లేదు. హైకోర్ట్ లో వరుస షాక్‌లు తగులుతున్నాయి.  తాజాగా జగన్ సర్కార్  జారీ చేసిన మరో జీవోకు హైకోర్టు బ్రేక్‌ వేసింది. రాజధాని అమరావతి ప్రాంతంలో ఇతర ప్రాంతాల వారికి భూముల్ని కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై హైకోర్టు స్టే విధించంది.  mగుంటూరు విజయవాడ , దుగ్గిరాల, పెదకాకాని ప్రాంతాలకు చెందిన 51వేలమందికి రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాల కోసం 1215 ఎకరాల భూమిని కేటాయించింది.

దీనిపై ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో ఈ జీవోపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాజధాని రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  ఈ పిటిషన్‌ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం జీవోపై స్టే విధించింది. విచారణ సందర్భంగా రాజధాని గ్రామాల్లోని పేదలకు మాత్రమే ఇక్కడి భూములు కేటాయించాలని సీఆర్డీఏ చట్టంలో ఉన్న విషయాన్ని రైతుల తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం ఈ మేరకు స్టే ఉత్తర్వులు జారీ చేసింది. దీనితో  ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పుడు ఆలోచనలో పడింది.అలాగే, మరోవైపు కర్నూలుకు కర్యాలయ తరలింపునపై కూడా ఇటీవలే కోర్టు అడ్డు చెప్పిన సంగతి తెలిసిందే.

ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనల్లో భాగంగా..కర్నూలు లో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా..న్యాయ విభాగం పరిధిలోకి వచ్చే శాఖలను కర్నూలును తరలించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. విజిలెన్స్ కమిషన్ - కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ కార్యాలయాలకు కర్నూలుకు తరలిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే జీవోల జారీ విషయంలోనూ వివాదం నెలకొని ఉంది. దీని పై హైకోర్ట్ లో విచారణ తరువాత  హైకోర్టు కర్నూలుకు కార్యాలయాల తరలింపు జీవోను సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
Tags:    

Similar News