రమేశ్ ఆసుపత్రి సిబ్బందికి హైకోర్టు బెయిల్

Update: 2020-09-04 12:45 GMT
ఆగస్టు 9 న విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసింది. ఈ కేసులో అరెస్ట్ అయిన రమేష్ ఆస్పత్రికి చెందిన ముగ్గురు అధికారులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది.

రమేష్ హాస్పిటల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ కొడాలి రాజగోపాల్ రావు, జనరల్ మేనేజర్ డాక్టర్ కురపతి సుదర్శన్ మరియు స్వర్ణ ప్యాలెస్ హోటల్‌లోని ఆసుపత్రి కోఆర్డినేటింగ్ మేనేజర్ పల్లబోతు వెంకటేష్ లకు హైకోర్టులో బెయిల్ లభించింది.

విజయవాడ సెంట్రల్ తహసీల్దార్ (బ్లాక్ రెవెన్యూ అధికారి) జయశ్రీ ఫిర్యాదు మేరకు క్రిమినల్ కేసు నమోదు చేసిన గవర్నర్‌పేట్ పోలీసులు ప్రమాదం జరిగిన రోజున ఈ ముగ్గురు అధికారులను అరెస్టు చేశారు.

ఆగస్టు చివరి వారంలో, ఈ ముగ్గురు ఎనిమిదో జిల్లా అదనపు కోర్టు ముందు బెయిల్ పిటిషన్ ను పెట్టుకున్నారు. కాని వారు హోటల్ అగ్ని ప్రమాదంలో ప్రత్యక్షంగా నిందితులు కావడంతో వారికి బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. కేసు ఇంకా దర్యాప్తులో ఉన్నందున బెయిల్ మంజూరు చేయలేమని మేజిస్ట్రేట్ తెలిపారు. ఫలితంగా వారు హైకోర్టును ఆశ్రయించారు. ముగ్గురు నిందితులకు శుక్రవారం హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

అంతకుముందు, రమేష్ హాస్పిటల్ యజమాని డాక్టర్ రమేష్ పోతినేని మరియు ఆసుపత్రి ఛైర్మన్ సీతారామ మోహనా రావు అరెస్టుపై కూడా హైకోర్టు స్టే ఇచ్చింది.. రమేష్ , రామ్మోహన్ రావు ఇద్దరూ అగ్ని ప్రమాదం జరిగినప్పటి నుండి పరారీలో ఉన్నారు.
Tags:    

Similar News