తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై సుప్రీం కోర్టులో నేడు కీలకమైన విచారణ జరిగింది. తెలంగాణ ఓటర్ల జాబితాలో బోగస్ ఓట్లు అంశంపై సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్ పై గురువారం నాడు విచారణ జరిగింది. దీంతో, తెలంగాణలో ముందస్తు ఎన్నికలు - ఓటర్ల జాబితాలో అవకతవకలపై దాఖలైన అన్ని పిటిషన్లను శుక్రవారం విచారణ చేపట్టాలని తెలంగాణ హైకోర్టును దేశంలోని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఒకవే ఆ జాబితాలో అవకతవకలు ఉన్నట్టు హైకోర్టు భావిస్తే తుది జాబితా గడువును పొడిగించవచ్చని హైకోర్టుకు సుప్రీం సూచించింది. ఒకవేళ ముందస్తు ఎన్నికలపై స్టే విధించాల్సి వస్తే ...హైకోర్టుకు ఆ అధికారం ఉందని సుప్రీం స్పష్టం చేసింది. తాజాగా సుప్రీం ఇచ్చిన ఆదేశాలు తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. రేపు హైకోర్టు ఏ తీర్పు వెలువరించనుందో అని సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది.
తెలంగాణలో 68 లక్షల బోగస్ ఓట్లున్నాయని కాంగ్రెస్ పార్టీ నేత మర్రి శశిధర్ రెడ్డి సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. దాంతోపాటు, ముందస్తు ఎన్నికల్లో 2018 - జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారికే ఓటు హక్కు అని ఈసీ చేసిన ప్రకటనపై శశాంక్ రెడ్డి అనే వ్యక్తి మరో పిటిషన్ వేశారు. ఈసీ నిర్ణయంతో 20 లక్షల మంది ఓటు హక్కు కోల్పోతారని తెలిపారు. ఈ రెండు పిటిషన్లపై వాదనలు విన్న సుప్రీంకోర్టు.....అన్ని పిటిషన్లను శుక్రవారం నాడు విచారణ చేపట్టాలని హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 8వ తేదీన ఎన్నికల సంఘం ఓటర్ల తుది జాబితాను విడుదల చేసే లోపు విచారణ పూర్తి చేయాలని సూచించింది. ఒకవేళ జాప్యం జరిగితే ఓటర్ల జాబితా విడుదలను వాయిదా వేసుకోవాలని సూచించింది. తాజాగా సుప్రీం ప్రకటనతో టీఆర్ ఎస్ కు షాక్ తగిలినట్లేనని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. రేపు హైకోర్టు ఏం తీర్పు చెప్పబోతోందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.