కొత్త సచివాలయాన్ని నిర్మించేందుకు కంకణం కట్టుకున్నట్టుగా కనిపిస్తున్న కేసీఆర్ సర్కారు.. తెలంగాణ హైకోర్టు సంధించిన ప్రశ్నలతో నిజంగానే ఉక్కిరిబిక్కిరి అయ్యిందనే చెప్పాలి. అన్ని హంగులు ఉన్న సచివాలయం అందుబాటులోనే ఉండగా.. వందల కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి కొత్త సచివాలయం నిర్మించడం అవసరమా? అంటూ పీఎల్ విశ్వేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్ పై సోమవారం విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం సంధించిన ప్రశ్నలతో ప్రభుత్వ తరఫు న్యాయవాది నిజంగానే పొంతన లేని సమాధానాలు చెప్పి.. కేసీఆర్ సర్కారును ఇబ్బందుల్లోకి నెట్టేశారన్న వాదన వినిపిస్తోంది. విచారణ సందర్బంగా కొత్త సచివాలయం ఆవశ్యకతపై సర్కారీ ప్లీడర్ వినిపించిన వాదనలు - హైకోర్టుకు ఇచ్చిన సంజాయిషీలు అసలు అతకలేదన్న విశ్లేషణలు కూడా ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
అయినా విచారణ సందర్భంగా కేసీఆర్ సర్కారుకు హైకోర్టు సంధించిన ప్రశ్నలు ఏ రేంజిలో ఉన్నాయన్న విషయానికి వస్తే... ఇప్పటికే అన్ని వసతులతో కూడిన సచివాలయం అందుబాటులో ఉండగా కొత్త సచివాలయం కట్టాల్సిన అవసరం ఉందా? అని కోర్టు కేసీఆర్ సర్కారును సూటిగానే ప్రశ్నించింది. అసలు ఇప్పుడున్న సచివాలయాన్ని ఎందుకు కూలుస్తున్నారో చెప్పాలంటూ హైకోర్టు సూటిగానే ప్రశ్నించింది. అంతేకాకుండా అగ్నిమాపక శాఖ ఇచ్చిన నివేదికను కూడా ప్రస్తావించిన హైకోర్టు... అగ్నిమాపక శాఖ కూడా ఇప్పుడున్న సచివాలయాన్ని కూల్చేయాలని చెప్పలేదు కదా అని ప్రశ్నించింది. అగ్ని ప్రమాదాల నివారణ చేపట్లాలని మాత్రమే కదా ఆ శాఖ సూచించింది అని కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇక ఏపీకి కేటాయించిన ఐదు బ్లాకులు కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా ఆ సచివాలయం అన్ని శాఖలకు సరిపోవడం లేదా? అని కూడా హైకోర్టు ప్రశ్నించింది. ఇలా హైకోర్టు ప్రశ్నల పరంపరను కొనసాగించడంతో ప్రభుత్వ తరఫు న్యాయవాది తలాతోకా లేని సమాధానాలు ఇచ్చి కేసీఆర్ సర్కారును అడ్డంగా బుక్ చేశారన్న వాదన వినిపిస్తోంది.
విచారణ సందర్భంగా కేసీఆర్ సర్కారు వాదనను బలంగా వినిపించేందుకు ప్రభుత్వ తరఫు న్యాయవాది నేల విడిచి సాము చేశారన్న వాదన కూడా వినిపిస్తోంది. అగ్నిమాపక శాఖ ప్రస్తుత సచివాలయానికి అగ్ని ప్రమాదం పొంచి ఉందని, దీంతోనే దానిని కూల్చివేయాలని నివేదిక ఇచ్చిందని ఓ సారి, అన్ని శాఖల కార్యాలయాలన్నింటినీ ఒకే చోట ఏర్పాటు చేసేందుకే కొత్త సచివాలయాన్ని నిర్మిస్తున్నామని మరోసారి, సాంకేతిక కమిటీ కూడా ప్రస్తుత సచివాలయాన్ని కూల్చేయాలని, కొత్త సచివాలయం కట్టాలని సూచనలు చేసిందని మరోసారి... ఇలా తన వాదనలను కోర్టు కొట్టిపడేస్తుంటే... సర్కారీ ప్లీడర్ పొంతన లేని సమాధానాలు చెప్పుకుంటూ పోయారు. అయితే ప్రభుత్వ న్యాయవాది చెప్పిన ప్రతి కారణానికి కూడా ఓ వైపు నుంచి పిటిషనర్ తో పాటు మరోవైపు కోర్టు కూడా కౌంటర్లు ఇచ్చేస్తుంటే... సర్కారీ ప్లీడర్ ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
అయితే కొత్త సచివాలయంపై కేసీఆర్ సర్కారుకు ప్రశ్నల వర్షం కురిపించడంతోనే ఊరుకోని హైకోర్టు... పిటిషనర్ కూ ప్రశ్నలు సంధించింది. అయితే ప్రభుత్వ న్యాయవాది మాదిరిగా పిటిషనర్ తరఫు న్యాయవాది ఎంతమాత్రం తడబడలేదనే చెప్పాలి. పిటిషనర్ వాదనను బలంగా వినిపించేందుకు సదా సిద్ధమై వచ్చిన న్యాయవాది... పిటిషనర్ వాదనను బలంగానే వినిపించారు. ప్రభుత్వ న్యాయవాది చేసిన ప్రతి వాదనకూ కౌంటర్ ఇస్తూ... పిటిషనర్ న్యాయవాది తనదైన శైలి చాకచక్యం చూపారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం... విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. తొలి రోజు వాదనల్లోనే ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టగా... రెండో రోజు విచారణలో తన వాదనను కేసీఆర్ సర్కారు ఎలా నెట్టుకొస్తుందో చూడాలి.