విభజన నేపథ్యంలో ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుకు సంబంధించిన న్యాయ సంబంధమైన అంశాల విషయంలో హైకోర్టు చీఫ్ జస్టిస్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ప్రశ్నలు వేసినట్లు కనిపించినా.. కేంద్రం వైఖరిని తీవ్రస్థాయిలో వేలెత్తి చూపటమే కాదు.. కేంద్ర ప్రభుత్వ బాధ్యతను గుర్తుకు తెచ్చే ప్రయత్నం చేయటం గమనార్హం.
ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుపై ప్రజాహిత వ్యాజ్యం దాఖలైన సందర్భంగా.. ధర్మాసనం ముందు మరోసారి చర్చ మొదలైంది. ఈ సందర్భంగా కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి తరఫున దాఖలు చేసిన అఫిడవిట్‌ను పరిశీలించిన హైకోర్టు.. ఒకట్రెండు పేరాలు తప్పించి మిగిలిన విషయాలన్నీ అనవసరమైనవిగా తేల్చింది. అంతేకాదు.. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని తీవ్రంగా తప్పు పట్టింది.
హైకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు చూస్తే..
= ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి అసమంజసంగా ఉంది.
= హైకోర్టు ఏర్పాటు విషయంలో బాధ్యతారాహిత్యంతో వ్యవహరించినట్లు కనిపిస్తోంది.
= నూతనంగా ఏర్పాటు చేసిన చేసిన రాష్ట్రాలు చిన్న బిడ్డలాంటివి. వాటిని ఏర్పాటు చేసిన మీకు..వాటి బాగోగులు చూసే బాధ్యత కూడా మీదే.
= ఏపీలో ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి.. ఏపీ ముఖ్యమంత్రికి ఏ విధంగా ఉంటుందో చెప్పండి?
= ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఆర్థిక సాయం చేయాల్సింది మీరు.. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుకు ప్రకటన ఇవ్వాల్సింది రాష్ట్రపతి కదా?
= మీ బాధ్యతల్ని నిర్వర్తించకుండా పక్కవాళ్లపై అపవాదు వేయటం ఏమిటి?
= ఏపీలో ప్రత్యేక ఏర్పాటుకు కేంద్రం ఎంత నిధులు కేటాయించిందో లెక్కలు చెప్పండి?
= ప్రస్తుత హైకోర్టు ప్రాంగణంలోనే రెండు హైకోర్టు నిర్వహణపై సాధ్యాసాధ్యాల గురించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయాన్ని కోరామంటూ హోంశాఖ ఇచ్చిన అఫిడవిట్లో పేర్కొనటంపై స్పందిస్తూ.. ''చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా (సీజేఐ)ని అభిప్రాయం కోరే అధికారం మీకెక్కడుందో చెప్పండి'' అంటూ కేంద్రాన్ని నిలదీసింది.
= సీజేఐ ఇచ్చిన సమాదానానికి సంబంధించిన లేఖను జత చేయకుండా.. హోంశాఖ చేస్తున్న వాదనను ఎలా నమ్మాలి?
= హైకోర్టు జడ్జిల వ్యవహారం దేశవ్యాప్తమైంది.. దాన్ని రాష్ట్ర కోటాగా ఎలా పేర్కొంటారు?
= కేంద్ర హోంశాఖ దాఖలు చేసిన అఫిడవిట్ జాతీయ సమైక్యతను దెబ్బ తీసేదిగా ఉంది.