ఐటీ కంపెనీలు.. భూమ్ ఉంటే వందలాది మందిని తీసుకుంటాయి. ఇలాంటి కరోనా టైంలో ఉపద్రవం వస్తే అంతేస్థాయిలో తీసివేస్తాయి. సాఫ్ట్ వేర్ ఇంజినీర్లంతా అందుకే సెక్యూరిటీ ఎక్కువగా ఉండే పెద్ద ఐటీ సంస్థల వైపు మొగ్గు చూపుతారు. అందులోనే చేరుతారు. ఏ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయినా హైక్ - మంచి సంస్థ అయితే ఇట్టే మారిపోతుంటారు.
ఈ కోవలోనే ఐటీ పాలసీ ప్రకారం నెలకొల్పే సాప్ట్ వేర్ కంపెనీలకు ఊరటనిచ్చే నిర్ణయాన్ని హైకోర్టు తీసుకుంది. ఐటీ ఉద్యోగులను తీసేసే విషయంలో ప్రభుత్వం జోక్యం అనవసరమని పేర్కొంది. ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను తీసివేసే అధికారం ఉన్నాయని తీర్పునిచ్చింది.
ఐటీ పాలసీ ప్రకారం నెలకొల్పిన సాఫ్ట్ వేర్ కంపెనీలకు షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్ మెంట్ చట్టపరిధిలోకి రావని..ఐటీ కంపెనీ ఉద్యోగుల తొలగింపు వ్యవహారాలపై కార్మిక శాఖకు ఉత్తర్వులు జారీ చేసే అధికారం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఐటీ కంపెనీలకు షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్ మెంట్ చట్టం వర్తించదని రాష్ట్ర ప్రభుత్వం 2002లోనే ఉత్తర్వులు జారీ చేసిందని న్యాయమూర్తి జస్టిస్ నవీన్ రావు గుర్తు చేశారు.
హైదరాబాద్ లోని కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఇండియా ప్రై. లిమిటెడ్ దాఖలు చేసిన ఈ కేసులో ఈ మేరకు ఐటీ కంపెనీలకు ఊరటనిచ్చే తీర్పునిచ్చింది. తనను అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించారని కాగ్నిజెంట్ లో ప్రాజెక్టు మేనేజర్ గా పనిచేసిన పి.అప్పలనాయుడు వికారాబాద్ లోని కార్మికశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. 2011లో ఉద్యోగంలో చేరితే 2013లో తీశారని 48(1) యాక్ట్ కింద ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును విచారించిన కార్మిక శాఖ.. అప్పలనాయుడుకు 2017 ఏప్రిల్ వరకు జీతం చెల్లించాలని కంపెనీని ఆదేశించింది. దీంతో హైకోర్టులో రిట్ వేసిన కాగ్నిజెంట్ వాదనను న్యాయమూర్తి సమర్థించారు.
ఉద్యోగులను తీసేవేసే విషయంలో ప్రభుత్వానికి ఎటువంటి అధికారాలు లేవని.. సంస్థకే ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది.