పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్స్ చేస్తే అభ్యతరం లేదు : హైకోర్టు

Update: 2020-12-10 12:43 GMT
తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్‌ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ ప్రారంభం కాగా, వ్యవసాయేతర భూముల నమోదు మాత్రం వాయిదా పడుతూ వచ్చింది. ఈ కేసుపై విచారణ జరుపుతోన్న తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రేషన్ ‌లపై స్టే ఇవ్వలేమని హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది. ధరణి పోర్టల్‌ లో ఆస్తుల నమోదుపై సుదీర్ఘ విచారణ జరిపిన హైకోర్టు, పాత పద్దతిలో రీజిస్ట్రేషన్ చేస్తే తమకేం అభ్యంతరం లేదని తెలిపింది. అంతేకాకుండా ప్రభుత్వాన్ని ధరణి వివరాలు మాత్రమే ఆపాలని సూచించామని తెలిపింది. ఈ వ్యాఖ్యపై స్పందించిన ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ప్రభుత్వమే రిజిస్ట్రేషన్లను ఆపిందని హైకోర్టుకు తెలిపారు.

ఇకపోతే , రిజిస్ట్రేషన్ ‌లు గతంలో సిఏఆర్డి పద్దతిలో జరిగాయని, ఇప్పుడు కూడా అదే పద్దతి కొనసాగించాలని పిటీషనర్‌ తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. ఆన్‌ లైన్ స్లాట్ బుకింగ్ గతంలో మాదిరిగానే రిజిస్ట్రేషన్ చేసుకునే విదంగా చూడాలని అడ్వొకేట్ జనరల్ కోరారు. ఆధార్ కార్డు వివరాలను ధరణిలో నమోదు కోసం అడగవద్దని పిటీషనర్ తరపు న్యాయవాది కోరారు. రూల్స్ 221, 230 ఏపీ అండ్‌ తెలంగాణ రాష్ట్ర రిజిస్ట్రేషన్ , సెక్షన్‌ 70B ప్రకారం తెలంగాణ మొత్తం నోటిఫై చేయాలని హైకోర్టు ఆదేశించింది.

నాన్‌ అగ్రికల్చర్ ఆస్తులను ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేయొచ్చని హైకోర్టు సూచించింది. స్లాట్ బుకింగ్‌ తో పాటు పీటీఐఎన్‌ ఆధారంగా ఉన్న పద్దతిలోనే రిజిస్ట్రేషన్ చేయాలని విజ్ఞప్తి చేసింది. అమ్మేవారు, కొనేవారు తప్పని సరిగా రిజిస్ట్రేషన్ ఆఫీస్‌ కు వెళ్లి పాత పద్ధతిలో రీజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపింది. ధరణిపై మాత్రం ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు అదేశించింది. ఆ తరవాత తదుపరి విచారణను ఈ నెల 16 కి వాయిదా వేసింది.
Tags:    

Similar News