భద్రత వలయంలోకి రేవంత్ రెడ్డి..ఏమైంది?

Update: 2018-10-29 10:49 GMT
తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. రేవంత్ రెడ్డి తనకు రాజకీయ శత్రువుల నుంచి ప్రాణ హాని ఉందని.. తెలంగాణ ప్రభుత్వం తన భద్రత గురించి పట్టించుకోవడం లేదని హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. వెంటనే తనకు భద్రతను పెంచాలని కోరారు.

రేవంత్ రెడ్డి పిటీషన్ ను విచారించిన హైకోర్టు.. 4+4 సీఆర్పీఎఫ్ పోలీసుల రక్షణను కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ తీర్పు తెలంగాణ రాజకీయాల్లో ప్రాముఖ్యతను సంతరించుకుంది. రేవంత్ రెడ్డి అధికార టీఆర్ఎస్ కు కొరకరాని కొయ్యగా మారారు. విమర్శలతో బెంబేలెత్తిస్తున్నారు. దీంతో టీఆర్ఎస్ శ్రేణులంతా రేవంత్ పై తీవ్ర ఆగ్రహం గా ఉన్నారు. ప్రచారపర్వంలో దూసుకెళ్దామనుకుంటున్న రేవంత్ కు భద్రత కరువైంది. తెలంగాణ ప్రభుత్వం తగ్గించడంతో హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో ఇప్పుడు భద్రత వచ్చేసింది. దీంతో మరింత దూకుడుగా ప్రచార పర్వంలోకి దూకాలని రేవంత్ రెడ్డి పక్కా ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నారట..

ఓటుకు నోటు కేసులో ఇరుక్కుపోయిన రేవంత్ రెడ్డి.. తాజాగా ఈడీ - పాత కేసుల్లో కూడా విచారణను ఎదుర్కొంటున్నారు. కోడంగల్ నియోజకవర్గంలో ఎలాగైనా రేవంత్ రెడ్డిని ఓడించడానికి కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలోనే తనకు వచ్చిన అదనపు సెక్యూరిటీతో రేవంత్ టీఆర్ ఎస్ ను ఓడించేందుకు విస్తృతంగా పర్యటనలకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు సమాచారం.
Tags:    

Similar News