హైకోర్టు తరలింపు.. జగన్ కు మోకాలడ్డారు

Update: 2020-02-26 08:22 GMT
ఏపీకి మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టి అమలు చేయాలని చూస్తున్న సీఎం జగన్ నిర్ణయానికి హైకోర్టు బ్రేక్ వేసింది. కర్నూలుకు తరలించాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన అన్ని పిటీషన్లను విచారించిన ఏపీ హైకోర్టు బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది.

హైకోర్టును కర్నూలుకు తరలించాలని చూస్తున్న జగన్ సర్కారు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వేసిన పిటీషన్ల తరుఫున సీనియర్ న్యాయవాది అంబటి సుధాకర్ వాదనలు వినిపించారు. 2015లో ఉమ్మడి హైకోర్టును ఏపీకి తరలించాలని అడిగే హక్కు తెలంగాణ ప్రభుత్వానికి, శాసనసభకు గాని లేదని నాడు తీర్పునిచ్చారని.. ఇప్పుడు కర్నూలుకు తరలించే హక్కు కూడా ఏపీ ప్రభుత్వానికి లేదని న్యాయవాది అంబటి సుధాకర్ వాదించారు.

ఈ వాదనతో ఏకీభవించిన హైకోర్టు తాజాగా హైకోర్టు తరలింపునకు బ్రేక్ వేసింది. అమరావతిలో నిర్మాణంలో ఉన్న హైకోర్టు పనులను ఆపవద్దంటూ జగన్ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఇక హైకోర్టు తరలింపు పిటీషన్లపై విడతల వారీగా వాదనలు వింటామని.. అప్పటి వరకూ కర్నూలుకు హైకోర్టుకు తరలించడాన్ని వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.


Tags:    

Similar News