తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట..

Update: 2019-04-16 12:08 GMT
తెలంగాణలో పరిషత్ ఎన్నికలకు టీఆర్ ఎస్ ప్రభుత్వం అంతా సిద్ధం చేస్తున్న వేళ.. మళ్లీ ప్రతిపక్షాలు హైకోర్టుకెళ్లాయి. వీటిని ఆపడానికి శతవిధాలా టెక్నికల్ కారణాలను చూపించాయి. పరిషత్ రిజర్వేషన్లలో బీసీలకు అన్యాయం జరిగిందని.. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయింపు జరపలేదని హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. దీనిపై మంగళవారం సాయంత్రం విచారించిన హైకోర్టు తెలంగాణలో పరిషత్ ఎన్నికలను ఆపలేమని స్పష్టం చేసింది. దీంతో కేసీఆర్ ప్రధాన అడ్డంకి తొలిగిపోయింది.

తెలంగాణలో అసెంబ్లీ - లోక్ సభ - పంచాయతీ ఎన్నికలు ముగియడంతో టీఆర్ ఎస్ ప్రభుత్వం మిగిలిన ఎంపీటీసీ - జడ్పీటీసీ - ఎంపీపీ ఎన్నికలకు నిర్ణయించింది. లోక్ సభ ఫలితాలు వెలువడే మే 23కు ఇంకా నెలన్నర రోజులు గడువు ఉండడంతో ఆలోపు పూర్తి చే్ద్దామని భావించింది. మిగిలిన నాలుగున్నరేళ్లు అయినా పాలించుకోవచ్చని కేసీఆర్ భావించాడు.

కానీ హైకోర్టులో బీసీలకు రిజర్వేషన్లు కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వలేందంటూ పిటీషన్ దాఖలైంది. ఎస్సీ - ఎస్టీలకంటే బీసీలకే పంచాయతీ ఎన్నికల్లో నష్టం జరిగిందని.. కాబట్టి మళ్లీ అదే రిజర్వేషన్ల ప్రకారం ఈ ఎంపీటీసీ - జడ్పీటీసీ ఎన్నికలు జరిగితే బీసీలు నష్టపోతారని వాదించారు.

కానీ హైకోర్టు తోసిపుచ్చింది. సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం.. రిజర్వేషన్లు 50శాతం ఉండాలి కాబట్టి ఈ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ దాని ప్రకారమే జరుగుతోందని.. దీన్ని ఆపలేమని హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు నిర్ణయంతో స్థానిక సంస్థల  ఎన్నికలకు లైన్ క్లియర్ అయ్యింది. కేసీఆర్ సర్కారుకు అతిపెద్ద అడ్డంకి తొలగింది. పార్లమెంట్ ఫలితాల లోపు ఈ ఎన్నికల ప్రక్రియను క్లోజ్ చేసేయచ్చు అని భావిస్తున్నారు.
Tags:    

Similar News