ఇళ్ల స్థలాల పంపిణీ.. ఏపీసర్కార్ కు హైకోర్టు జలక్

Update: 2020-08-13 13:34 GMT
ఆంధ్రప్రదేశ్ లో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీపై ఏ ముహూర్తాన సీఎం జగన్ నిర్ణయించారో కానీ అది వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. ఇప్పటికే ఆగస్టు 15 సందర్భంగా పంపిణీ చేద్దామనుకున్న కార్యక్రమం మరోసారి వాయిదా పడింది. తాజాగా ఇదే ఇళ్ల స్థలాలపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాకిచ్చింది.

తాజాగా హైకోర్టులో మైనింగ్ భూములను ఇళ్ల పట్టాల కోసం కేటాయించారని దాఖలైన పిటీషన్లపై విచారణ జరిగింది. ఈ పిటీషన్ పై విచారించిన హైకోర్టు దీనిపై స్టే ఇచ్చింది. కౌంటర్ దాఖలు చేయాలని.. అప్పటివరకు పేదలకు ఇళ్ల పంపిణీపై భూసేకరణ జరపవద్దని ఆదేశించింది.

ఏపీలోని మైనింగ్ భూములను ఇతర అవసరాలకు వినియోగించవద్దని హైకోర్టు పేర్కొంది. మైనింగ్ భూములపై కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుందని హైకోర్టు వ్యాఖ్యానించింది.

దీంతో దాదాపు 25 లక్షలకు పైగా పేదలకు ఇళ్లపట్టాలు ఇవ్వాలనుకున్న ఏపీ ప్రభుత్వానికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఉగాది నుంచి ఈ కార్యక్రమం వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. ఇప్పుడు న్యాయ సమస్యలతో వాయిదా పడింది. గాంధీ జయంతికి పంపిణీ చేయాలని ఏపీ సర్కార్ భావిస్తోంది.
Tags:    

Similar News