ఆసక్తికర నిర్ణయాన్ని వెలువరించింది హైకోర్టు. కష్ణానదికి కరకట్టకు మధ్య నిర్మించిన ఒక భవనాన్ని కూల్చాలని సీఆర్డీయే ఇచ్చిన నోటీసుపై హైకోర్టు ఇచ్చిన తాజా ఆదేశం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సీఆర్డీయే ఇచ్చిన నోటీసును మూడు వారాలపాటు నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.
అమరావతి పరిధిలోని తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామపరిధిలో నిర్మించిన రెండంతస్తుల భవనాన్ని.. షెడ్లను ఏడు రోజుల్లో తీసివేయాలని.. లేదంటే తామే తొలిగిస్తామంటూ నోటీసులు ఇచ్చారు. దీంతో.. ఈ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తు భవన యజమాని.. పారిశ్రామికవేత్త చందన కేదారీశ్ హైకోర్టును ఆశ్రయించారు.
సీఆర్డీఏ తీరును పిటిషన్ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ భవనాన్ని రైతు సంఘం భవన్ పేరుతో 2007-07లో నిర్మించారని.. అప్పటికి సీఆర్డీయే ఆవిర్భవించలేదన్నారు. ఏపీ సీఆర్డీయే చట్టాని కంటే ముందే ఈ భవనాన్ని నిర్మించినందున వాటిని తొలగించే అధికారం సదరు అధికారికి లేదని వాదనలు వినిపించారు.
కూల్చివేతకు నోటీసులు ఇచ్చిన అంశంపై స్టే విధించాలని కోరారు. ఇదిలా ఉంటే.. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది వాదిస్తూ.. నదీ తీరంలో నిర్మాణాల్ని తొలగించామని జాతీయ హరిత ట్రైబ్యునల్ గతంలోనే ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. ఈ చట్టం ప్రకారం కృష్ణానదీ తీరంలో వెంట ఉన్న అన్ని కట్టడాలకు సీఆర్డీయే పరిధిలోకే వస్తాయని వాదించారు. అసలు కోర్టుకు వెళ్లటం కూడా సరికాదని.. ఇలాంటి అభ్యంతరాలు ఉంటే అప్పిలేట్ అథారిటీని ఆశ్రయించాలే కానీ ఇలా హైకోర్టు వద్దకు రావటం ఏమిటని ప్రశ్నించారు. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం ఈ వ్యవహారంపై మూడు వారాల తర్వాత విచారించనున్నట్లు పేర్కొన్నారు. అప్పటివరకూ ఈ నిర్మాణాన్ని కూల్చకూడదన్న ఆదేశాల్ని జారీ చేశారు. మరి.. కరకట్ట మీద ఇప్పటికే నిర్మించిన అక్రమ భవనాల్ని కూల్చివేయాలన్న సీఎం జగన్ సంకల్పం ఏమవుతుందో చూడాలి.