తెలంగాణ హైకోర్టు ప్రాంగణంలో ఆశ్చర్యకరమైన పరిణామం ఒకటి చోటు చేసుకుంది. అక్కడ నిర్వహించిన కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ ఎంగిలి ప్లేట్లను ఎత్తిన వైనం షాకింగ్ గా మారటమే కాదు.. చాలామందికి కొత్త స్ఫూర్తిని ఇచ్చింది. హైకోర్టు జడ్జి స్థానంలో ఉండి కూడా పరిసరాల్ని శుభ్రంగా ఉంచాలన్న ఉద్దేశంతో ఆయన తన హోదాను పక్కన పెట్టి వ్యవహరించిన తీరుపై పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
అత్యుత్తమ స్థానాల్లో ఉన్న వారు దర్పాన్ని ప్రదర్శించకుండా ఇలా వ్యవహరిచటం ద్వారా సమాజానికి స్ఫూర్తిని ఇచ్చినట్లు అవుతుందని చెబుతున్నారు. సీనియర్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ కుమార్ హరియాణ హైకోర్టుకు బదిలీ మీద వెళుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు వీడ్కోలు పార్టీ ఇచ్చారు. దీనికి హైకోర్టు ఫుల్ బెంచ్ న్యాయమూర్తులు హాజరయ్యారు.
కార్యక్రమంలో భాగంగా స్నాక్స్.. టీ అందజేశారు. స్నాక్స్ ను తిన్న వారు.. ఎవరికి వారు ప్లేట్లను ఎక్కడికక్కడ పడేశారు. దీన్ని చూసిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ కింద పడిన ఎంగిలి ప్లేట్లను ఒక్కొక్కటిగా ఏరటం మొదలుపెట్టారు. ఆయన చేస్తున్న పనిని ఆశ్చర్యంగా చూసిన వారు.. వెంటనే తమ కర్తవ్యం గుర్తుకు వచ్చినట్లుగా.. ఎవరికి వారు కింద పడేసిన ఎంగిలి ప్లేట్లను ఎత్తటం షురూ చేశారు. కాసేపటికేఆ ప్రాంగణమంతా శుభ్రం అయిపోయింది. ఈ ఘటన పలువురిని ఆకర్షించింది. ఏమైనా.. పరిసరాల్నిశుభ్రంగా ఉంచాలన్న అంశంలో కొత్త స్ఫూర్తినిచ్చిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కోదండరామ్ అభినందనీయులని చెప్పక తప్పదు.