చంద్రబాబు భద్రత ప్రధానికైనా లేదేమో..?

Update: 2016-11-18 17:30 GMT
చంద్రబాబు భద్రత రోజురోజుకూ పెంచుకుంటూ పోతున్నారు. భద్రత అవసరమే అయినప్పటికీ ఏకంగా సైన్యాన్ని దించారా అన్నట్లుగా భదత్ర కనిపిస్తుంటే జనం చంద్రబాబును చూసి భయపడే పరిస్థితి వచ్చినా రావొచ్చన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటికే వందలాది మందిని చంద్రబాబు భద్రతకు ఉపయోగిస్తున్నారు. జడ్‌ ప్లస్ కేటగిరిలో ఉన్న బాబుకు ఎన్‌ ఎస్‌ జీ కమాండోలు అనుక్షణం కాపుకాస్తుంటారు. ఇటీవల ఏవోబీలో జరిగిన భారీ ఎన్‌ కౌంటర్ నేపథ్యంలో చంద్రబాబుపై దాడి చేస్తామని మావోయిస్టులు హెచ్చరించడాన్ని దృష్టిలో ఉంచుకుని కొద్ది రోజుల క్రితమే భద్రతను కట్టుదిట్టం చేశారు. తాజాగా చంద్రబాబు భద్రత కోసం సుమారు 300 పోస్టులు సృష్టించారు.

చంద్రబాబు భద్రత కోసం అచ్చంగా మరో 290 పో్స్టులను సృష్టించారు. ఐదుగురు ఎస్పీలు - ఏడుగురు డీఎస్పీలు - 23 మంది సీఐలు - 51 మంది ఆర్‌ ఎస్‌ ఐలను కొత్తగా చంద్రబాబు భద్రతకు మోహరిస్తున్నారు. వీరు కాకుండా భారీగా కానిస్టేబుళ్లను వినియోగించనున్నారు. ఇప్పటికే చంద్రబాబు జిల్లా పర్యటనలకు వెళ్లిన సమయంలో వెయ్యి మందికి తగ్గకుండా పోలీసులను వినియోగిస్తున్నారు.

అయితే... ఇంత భద్రత అవసరమా అన్న ప్రశ్నలూ వినిపిస్తున్నాయి. చంద్రబాబు మాదిరిగానే మావోయిస్టుల బెదిరింపులు ఎదుర్కొన్న మరో సీఎం... నిత్యం మావోయిస్టు కార్యకలాపాలతో అశాంతి నెలకొలన్న ఒడిశా సీఎం నవీన్ పట్నాయిక్ భద్రతతో పోల్చితే చంద్రబాబు భద్రత 100 రెట్లు అధికంగా కనిపిస్తోంది. నవీన్ చాలాకాలంగా మావోయిస్టుల హిట్ లిస్టులో ఉన్నారు. ఏపీలో కంటే ఒడిశాలో మావోయిస్టులకు పట్టు అధికం. అయినా... నవీన్ భద్రత చూస్తే ఆశ్చర్యమేస్తుంది. ముఖ్యమంత్రిగా ఆయనకు కూడా జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉంది. అంతకుమించి వేరే ఏర్పాట్లు పెద్దగా లేవు. ఎప్పుడైనా ఆందోళనలు, ఉద్రిక్తతలు ఉన్న చోటికి వెళ్లినప్పుడు మాత్రమే పోలీసుల మోహరింపు ఉంటుంది.

నవీన్ వాడే వాహనం నుంచే చంద్రబాబుకు ఆయనకు తేడా కనిపిస్తుంది. ఒడిశా సీఎం వాడేది సాధారణ మారుతి కారు.. ఎదురుగా ఉన్న అద్దం... ముందు రెండు డోర్ల అద్దాలు మాత్రమే బుల్లెట్ ప్రూఫ్. ఆయన మారుతి కారు సహా కాన్వాయ్ లో మొత్తం ఏడు వాహనాలే ఉంటాయి. అందులో ఒకటి మారుతి ఓమ్నిలో ఉండే అంబులెన్సు. బహుశా తెలుగు రాష్ట్రాల్లో చిన్ననర్సింగ్ హోం కూడా అలాంటి డొక్కు అంబులెన్సు వాడడం మానేసి రెండు దశాబ్లాలు అయ్యుంటుందేమో. సీఎం కారు, అంబులెన్సు పోగా మిగిలినవి అయిదు వాహనాలు. అందులో ఒకటి ఒకటి డొక్కు జీపు. అది పైలట్ వెహికల్. దాంతో పాటు ఇంకో పైలట్ వెహికల్. మిగతావి మన దగ్గర సర్పంచులు, ఎంపీటీసీలు కూడా వాడడం మానేసిన పాత సుమోలు. అదీ మావోయిస్టుల ప్రభావం అత్యధికంగా ఉన్న ఒక రాష్ట్ర సీఎం సెక్యూరిటీ పరిస్థితి. మరి.. మన సీఎం చంద్రబాబు భద్రత ఎలా ఉందో చూడండి.. కొత్తగా ఆయన సృష్టించిన పోస్టులే 290.. ఇప్పటికే 300 మందికి పైగా ఆయన భద్రతలో ఉన్నారు. ఇక ఆయన ఇంటివద్ద అయితే 1500 మంది కాపలా ఉంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News