కాలేజీ అమ్మాయిలను లొంగదీసుకుంటారు. వారికి మాయమాటలు చెప్పి కూల్ డ్రింక్స్ తో మత్తు, డ్రగ్స్ కలిపి ఇస్తారు. నగ్నంగా పోర్న్ వీడియోలు తీస్తారు. వాటిని చూపించి బ్లాక్ మెయిల్ చేయించి హైటెక్ వ్యభిచారం నిర్వహించారు. కాలేజీ అమ్మాయిలే కాదు.. ఈ దందాలో స్కూలు విద్యార్థినులు ఉండడం విస్తుగొలుపుతోంది. ఇంతమంది జీవితాలతో ఆటలాడిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ దారుణం వెలుగుచూసింది. దీంతో కాలేజీ అమ్మాయిలు, కుటుంబసభ్యులు షాక్ అయ్యారు.
తమిళనాడులోని ముధురైలో గల మధుర మీనాక్షి ఆలయానికి సమీపంలోగల ఫేమస్ ప్రైవేట్ కాలేజీ విద్యార్థులు హైటెక్ ముఠాకి చిక్కి బలయ్యారు. ఓ విద్యార్థికి మొదట పోర్న్ ఎస్ఎంఎస్ లు వెళ్లాయి. వీడియోలు వచ్చాయి. దీనిపై ఫోన్ చేస్తే మీకు కావలసినంత డబ్బులు, బంగారం, నగలు ఇస్తామని.. మీరు సుఖపడుతారని.. మేం చెప్పినట్టు వ్యభిచారం చేయాలని ఓ విద్యార్థినికి ముఠా సభ్యులు ఎరవేశారు. ఆ కాలేజీ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగంలోకి దిగి ఫోన్ నంబర్ ఆధారంగా ముగ్గురిని అరెస్ట్ చేశారు.
తల్లాకుళంలోని విలాసవంతమైన ప్రైవేట్ రెస్టారెంట్ ను బేస్ చేసుకొని దాని నిర్వాహకుడు.. అందులోని మొబైల్ సాపు యజమాని కలిసి కాలేజీ అమ్మాయిలకు వలవేసి లొంగదీసుకొని ఈ హైటెక్ వ్యభిచారం కేంద్రం నిర్వహించారని పోలీసుల విచారణలో వెల్లడైంది.
అమ్మాయిలకు ఇలా ఫోన్ చేసి వలవేసి వారికి డబ్బులిచ్చి మొదట విహారయాత్రలకు తీసుకెళతారు. అక్కడ మత్తు, డ్రగ్స్ కలిపిన పానీయాలు ఇచ్చి పోర్న్ వీడియోలు తీస్తారు. మేం చెప్పినట్టు వినకపోతే ఈ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేసి కాలేజీ, హైస్కూల్ విద్యార్థినులతో హైటెక్ వ్యభిచారం కొద్దిరోజులుగా చేస్తున్నట్టు విచారణలో తెలిసింది.
ముఖ్యంగా కాలేజీ హాస్టల్ విద్యార్థులకు వల వేసి వారికి రోజు బిర్యానీలు, బీర్లు,వైన్ పంపిస్తూ మిగతా వారిని ఆకర్షించారు. వినని వారిపై అత్యాచారం చేయించి వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేయించి ఈ హైటెక్ వ్యభిచారం చేయించారు. చాలా మంది కాలేజీ అమ్మాయిలు భారీగా డబ్బు, విలాసవంతమైన జీవితం కోసం దిగజారిపోయి ఇలా వ్యభిచార కూపంలో చిక్కుకుపోయారని పోలీసుల విచారణలో వెలుగుచూసింది. మూడేళ్ల నుంచి కాలేజీ అమ్మాయిలతో ఈ దందా సాగుతున్నట్టు తెలిసింది.
పదేపదే లాక్ డౌన్ సమయంలో కాలేజీ విద్యార్థినులు రెస్టారెంట్ కు వెళ్లి వస్తుండడంతో ఆరతీయగా పోలీసులకు ఈ షాకింగ్ నిజం వెలుగుచూసింది. దీంతో ముగ్గురు నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు.